• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇంకో ఐదు జిల్లాల్లో...

ఇంకో ఐదు జిల్లాల్లో జ‌న‌సేన శిబిరాలు

By - Tupaki Desk
Update: 2017-05-30 10:59 GMT
అధికారం కోసం కంటే ప్ర‌శ్నించేందుకు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చామ‌ని ప్ర‌క‌టించి త‌న‌తో న‌డిచే వారి విష‌యంలో ఎంపిక ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టిన జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ క్ర‌మంలో మ‌రో ముంద‌డుగు వేశారు. ఉత్తరాంధ్ర - గ్రేటర్ హైదరాబాద్ లలో జనసేన నిర్వహించిన ప్రతిభా పాటవ ఎంపికల శిబిరాలను విజయవంతంగా పూర్తి చేసిన జ‌న‌సేన మరో ఐదు జిల్లాల్లో జనసేన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌యింది. ఈ క్ర‌మంలో తాజాగా ఆ వివ‌రాల‌ను తెలియ‌జేస్తూ జ‌న‌సేన ర‌థ‌సార‌థి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

``రాజకీయాలలో యువత - మేధావులను భాగస్వామ్యులుగా చేయాలని జనసేన తలపెట్టిన ఈ యజ్ఞానికి మీరు చూపుతున్న ఆద‌రాభిమానాలు ఎంతో విలువైనవిగా భావిస్తున్నాము. మీరు ఇస్తున్న ప్రోత్సాహంతో తెలుగు రాష్ట్రాలలోని మరో ఐదు జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాము. ఆదిలాబాద్ (పాత జిల్లా పరిధి), నిజామాబాద్ (పాత జిల్లా పరిధి), తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో వెలుగులు నింపాలని, దేశ రాజకీయాలను ప్రగతి వైపు మళ్లించాలని ఆశ, ధ్యాస ఉన్న ప్రతీ ఒక్కరు ఈ శిబిరంలో పాల్గొనడానికి అర్జులే. స్పీకర్ (వక్త), కంటెంట్ రైటర్, అనలిస్ట్ విభాగాలకు ఆన్ లైన్ లో తమ దరఖాస్తులు పంపడానికి జనసేన వెబ్ సైట్ లో లాగ్ ఆన్ అవ్వండి.`` అని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

``జనసేన ఆన్ లైన్ చిరునామా (యూ.ఆర్ .ఎల్ ) ఈ దిగువున పొందుపరుస్తున్నాము. 30 మే నుంచి జూన్ 3 తేది వరకు దరఖాస్తులు అప్ లోడ్ చేయవచ్చు. మరోసారి ఈ సమాచారాన్ని తెలుసుకోడానికి జనసేన ఫేస్ బుక్ పేజీ ను చూడండి. జైహింద్`` అని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ : https://www.janasenaparty.org/adilabaddistrict
నిజామాబాదు : https://www.janasenaparty.org/nizamabaddistrict
తూర్పుగోదావరి : https://www.janasenaparty.org/eastgodavaridistrict
ప్రకాశం : https://www.janasenaparty.org/prakasamdistrict
నెల్లూరు : https://www.janasenaparty.org/nelloredistrict
Tags:    
  • Pawan kalyan 
  • Janasena 
  • Telugu news 

Similar News

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

ఓటు వేసేందుకు అరవై కిలోమీటర్లు వెళ్ళాల్సిందే !

2026-11-03 04:08 GMT

ఏపీలో జగన్ వద్దా.. రాహుల్ ప్లాన్ ఏంటి ?

2026-11-03 04:08 GMT

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

Copyright @2026

Powered by Blink CMS