• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబుకు నెంబ‌ర్ వ‌న్...

బాబుకు నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ ఇచ్చిన జ‌గ‌న్‌

By - Tupaki Desk
Update: 2017-03-20 14:08 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సెటైర్ల‌తో కూడిన విమ‌ర్శ‌లు చేశారు. అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందుంద‌ని పేర్కొంటూ టీడీపీ వ‌ల్లే ఇది సాధ్య‌మైంద‌ని సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. విష‌యం తెలియ‌ని విప‌క్ష నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ ఏపీ నంబ‌ర్ వ‌న్ అనే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు కీల‌క విష‌యం ఒక‌టి మ‌ర్చిపోయారని అన్నారు. ఎన్‌ సీఏఈఆర్ సర్వే ప్రకారం అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్థానంలో ఉందని తేలిందని జగన్ అన్నారు. ఈ నంబ‌ర్ వ‌న్ ర్యాంకింగ్ ఘ‌న‌త కూడా టీడీపీ ఖాతాలో వేసుకోవాల‌ని ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తీరును జ‌గ‌న్ త‌ప్పుప‌ట్టారు. విద్యుత్‌ కు సంబంధించిన డిస్కమ్‌ లు నష్టాల్లో ఉంటే మనకు ఐదు అవార్డులు వచ్చాయని చంద్రబాబు మభ్యపెడుతున్నారని జగన్‌ మండిపడ్డారు. ఈ డిస్కమ్‌ లు రూ.2400 కోట్లు నష్టాల్లో ఉన్నాయని, అయినా ఐదు అవార్డులు వచ్చాయని అసత్యాలు చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. ఎన్నికలకు ముందుకు కాపులకు ఎన్నో  హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక విస్మరించారని జగన్ త‌ప్పుప‌ట్టారు. కాపులకు సంబంధించి ప్రతి ఏటా బడ్జెట్లో వెయ్యి కోట్ల కేటాయిస్తానని హామీ ఇచ్చారని, అయితే టీడీపీ కేటాయించింది కేవలం రూ.380 కోట్లు మాత్రమే అన్నారు. మంజునాథన్‌ కమిషన్‌ వేసి 8 నెలల్లో రిపోర్టు వస్తుందని చెప్పినా ఇంతవరకు ఎలాంటి నివేదికలు రాలేదని ఆక్షేపించారు. మైనార్టీలపై చంద్రబాబు ప్రేమ ఒలకబోశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 4800 మసీదులకు ప్రభుత్వం కేవలం రూ.3.50 కోట్లు ఇచ్చి గొప్పలు చెబుతున్నారని జ‌గ‌న్ మండిపడ్డారు. వరుస మూడేళ్లుగా కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాను నాలుగు రోజుల్లో కరువు వెళ్లిపోయిందని ప్రభుత్వం అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారు.  చంద్రబాబు నిజాలు చెప్పి ఉంటే సంతోషించేవాళ్లమని, ఇలా కట్టుకథలు చెప్పి ప్రజలను మోసం చేయడం సరికాదన్నారు. కరువును పారద్రోలేందుకు ఎయిర్‌గన్లు కొనుగోలు చేసిన దానికంటే, వాటిని ఆపరేట్‌ చేసేందుకు అంతకంటే ఎక్కువ నిధులు ఖర్చు చేశారని, నిధులు దుర్వినియోగానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదని చెప్పారు.

ఇదిలాఉండ‌గా...అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సంద‌ర్భంగా స‌భ‌లో ఒకింత గంద‌ర‌గోళం నెల‌కొంది. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతుండగా స్పీకర్ కోడెల శివప్ర‌సాద‌రావు మైక్‌ కట్‌ చేశారు. దీంతో తమ నేతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష సభ్యులు కోరుతూ స్పీకర్ పోడియం వ‌ద్ద‌కు చేరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Jagan 
  • Chandrababu Naidu 
  • Andhra Assembly 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS