మళ్లీ మైకు గొడవ మొదలైంది

Update: 2015-08-31 05:32 GMT
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెగ్యులర్ కనిపించే ఒకఅంశం ఉంటుంది. వీలైనంత సేపు మాట్లాడాలని.. మైక్ ను తన అధీనంలో ఉండాలని అటు ఏపీ ముఖ్యమంత్రితో పాటు.. ఇటు విపక్షనేత జగన్ పోటీ పడుతుంటారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మైకు అందుకునే అవకాశం ఉన్న చంద్రబాబుకు మైకు ఇబ్బంది లేదు కానీ.. విపక్షనేత జగన్ మాత్రం తనకు మైక్ కావాలని పట్టుబడుతుంటారు. ఒక అంశం గురించి మాట్లాడేందుకు మైక్ అడిగే జగన్.. మైకు ఇచ్చిన తర్వాత వేర్వేరు విషయాల్ని ప్రస్తావించటం. స్పీకర్ మైకును కట్ చేయటం మామూలే.

తాజా వర్షాకాల సమావేశాల మొదటి రోజు మొదటి గంటలోనే.. జగన్ మైకును అడగటం.. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మైకు ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని జగన్ పట్టుబట్టటం.. అందుకు ఓకే చెప్పిన స్పీకర్ మైకు ఇస్తే.. ఆ అంశం మీద సుదీర్ఘంగా ప్రసంగించటం మొదలు పెట్టటంతో స్పీకర్ మైకు కట్ చేశారు. దీంతో.. తాను మాట్లాడకుండా తన నోరును నొక్కేస్తూ.. మైక్ కట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీలో మళ్లీ మైకు గొడవ మొదలైందన్న మాట.
Tags:    

Similar News