మంత్రులకు సీఎం వార్నింగ్ ఇచ్చింది అందుకేనా?

Update: 2020-08-10 06:00 GMT
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ అధికారులతో కమిటీ వేశారు. ఇప్పుడా అధికార బృందం ఆ పనిమీదే సీరియస్ గా దృష్టిసారిస్తోంది. ఈ క్రమంలోనే తమకీ జిల్లా కావాలంటూ.. అది వద్దంటూ వైసీపీలో గొంతుకలు లేస్తున్నాయి. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ఇప్పటికే తమ జిల్లా విభజనపై అభ్యంతరం తెలిపారు. ఇక డిప్యూటీ సీఎం అరకును రెండు జిల్లాలు చేయాలని సూచించారు. దీంతో కొత్త జిల్లాల కోసం వైసీపీ సహా ఇతర నేతల నుంచి డిమాండ్లు లేవనెత్తి గందరగోళం సృష్టిస్తున్నారు.

దీనిపై సీఎం జగన్ సీరియస్ అయినట్టు తెలిసింది. గత కేబినెట్ భేటిలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన జరిగిన చర్చలో సీఎం జగన్ కొందరు మంత్రులకు సీరియస్ గా హెచ్చరిక చేసినట్టు ప్రచారం సాగుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తన వైఖరిని.. ప్రభుత్వం ఆలోచనను ఇద్దరు మంత్రులకు స్పష్టంగా జగన్ చెప్పారట.. కొత్త డిమాండ్లను.. అంశాలను తెరమీదకు తీసుకురావద్దని.. గందరగోళం సృష్టించవద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను మొత్తం అధికారులకే అప్పజెప్పుతున్నామని.. ఇందులో రాజకీయపరమైన జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

ఈ క్రమంలోనూ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్త జిల్లాల డిమాండ్లపై నోరు మెదపడం లేదట.. అందరూ సైలెంట్ అవ్వడం వెనుక జగన్ హెచ్చరికే కారణమని తెలుస్తోంది. మనకెందుకు వచ్చిన గొడవ అని వైసీపీ నేతలంతా మౌనంగా ఉండిపోతున్నారని సమాచారం.
Tags:    

Similar News