ఇక లాటరీ కాదు.. ‘జీతం’ బట్టే అమెరికా ఎంట్రీ.. హెచ్1బీ వీసాలో భారీ మార్పులు
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే సాఫ్ట్ వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాకిస్తూ ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బి వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది.;
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే సాఫ్ట్ వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాకిస్తూ ట్రంప్ ప్రభుత్వం హెచ్ వన్ బి వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు ఉన్న అదృష్టం ఆధారంగా రాండం లాటరీ తీసే పద్ధతికి స్వస్తి పలికి ఇకపై వేతనం నైపుణ్యం ఆధారంగా వీసాలు, కేటాయించాలని నిర్ణయించింది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్ లో ప్రచురించింది ఈ కొత్త విధానం 2025 ఫిబ్రవరి 27 నుంచి అమలులోకి రానుంది.
వేతనాల ఆధారంగా ప్రాధాన్యత.. నాలుగు అంచల వ్యవస్థ..
కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిని బట్టి నాలుగు కేటకేరీలుగా విభజించారు ఎవరికీ ఎక్కువ జీతం ఉంటే వారికి వీసా వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో లెవెల్ 4 కింద లాటరీల్లో నాలుగు సార్లు ప్రవేశించే అవకాశం వీరికి ఉంటుంది. దీని వల్ల వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. వీళ్ళు అధిక నైపుణ్యం వేతనం గల ఉద్యోగులుగా ఉన్నారు. ఇక లెవెల్ 3లో వీరు లాటరీలో మూడు సార్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంది. వీసా వచ్చే అవకాశం 46% గా ఉంటుంది. ఇక లెవల్ 2లో వీరు రెండుసార్లు మాత్రమే లాటరీలో ఉంటారు. వీసా పొందే అవకాశం వీరికి 31% గా ఉంటుంది. లెవల్ 1లో కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే వీరికి వీసా దక్కే ఛాన్స్ కేవలం 15% తగ్గిపోతుంది.
భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం..
ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ యువ ఇంజనీర్ల పై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా భారత్ నుంచి అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ 1 ఉద్యోగులే ఉంటారు. తాజా నిబంధనలతో అనుభవం తక్కువగా ఉన్న యువత కంటే భారీ ప్యాకేజీలు అందుకుని సీనియర్ నిపుణులకే అమెరికా పెద్దపీట వేయనుంది.
అమెరికా ఎంబసీ హెచ్చరిక
మరోవైపు నిబంధనల విషయంలో భారతీయులకు భారత్ లోని అమెరికాలోని ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది.సోషల్ మీడియా వెడ్డింగ్ తో పాటు డాక్యుమెంట్ల పరిశీలన కఠినంగా ఉంటుందని చెప్పింది అగ్రరాజ్య చట్టాలన్న అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు భావి జరిమాణాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. సరిహద్దులను కాపాడుకోవడానికి అక్రమ వలసలను అడ్డుకట్ట వేయడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టబడి ఉందని ఎంబసీ ప్రతినిధులు తెలిపారు.
అదృష్టం కంటే ప్రతిభకు అధిక వేతనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది అమెరికా ఉద్దేశం. అయితే ఇది అమెరికా వెళ్లాలనుకునే సగటు భారతీయ ఐటీనిపుణుడి కలపై నీళ్లు చల్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.