ఎఫ్-1 విద్యార్థులకు గ్రీన్ కార్డ్ సంకటం

ఇల్లినాయిస్ లో చదువుతున్న ఒక భారతీయ విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం అమెరికాలోని వేలాదిమంది విద్యార్థుల ప్రతిబింబంగా మారాడు.;

Update: 2025-12-31 10:30 GMT

అమెరికా కల ఇప్పుడు సందిగ్దంలో పడింది. చదువు పూర్తి కావస్తున్న గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడంతో భారతీయ విద్యార్థులు స్టేటస్ కాపాడుకోవాలా లేక ఉద్యోగ అవకాశం అందుకోవాలా అనే డైలామాలో కొట్టుమిట్టాడుతున్నారు.

గ్రీన్ కార్డ్ కోసం నిరీక్షణ.. ఒక మానసిక పోరాటం

ఇల్లినాయిస్ లో చదువుతున్న ఒక భారతీయ విద్యార్థి పరిస్థితి ప్రస్తుతం అమెరికాలోని వేలాదిమంది విద్యార్థుల ప్రతిబింబంగా మారాడు. డిసెంబర్ 2022 నుంచి కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థి ప్రస్తుతం ఇంటర్నెట్ షిప్ చేయాల్సిన దశకు చేరుకున్నాడు. అటు కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. ఇటు కేరియర్ నిలబెట్టుకోవాలనే తపన అతడిని ఒక కఠిన నిర్ణయం వైపు నెట్టేలా చేస్తున్నాయి.

ఓపిటి వర్సెస్ ఐ-485 ఈఏడి? అసలు చిక్కు ఇక్కడే?

సాధారణంగా ఎఫ్ వన్ స్టూడెంట్ వీసా పై ఉన్న విద్యార్థులు తమ చదువు తర్వాత లేదా చదువుతూ ఓపిటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా పనిచేయడానికి అనుమతి పొందుతారు. అయితే దీనికి కఠినమైన నిబంధనలు కాల పరిమితులు ఉంటాయి. మరోవైపు గ్రీన్ కార్డు దరఖాస్తు ఐ 485 పెండింగ్లో ఉన్నవారు ఎంప్లాయ్మెంట్ ఆర్థరైజేషన్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా ఓపిటి పరిమితులు లేకుండా పని చేయవచ్చనేది కొందరి ఆలోచన . ఎప్పుడో వచ్చే గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తూ కూర్చోవడం కంటే ఈఏడి తో స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చు కదా అనే ప్రశ్న ఇప్పుడు విద్యార్థులను తొలిచేస్తుంది.

నిపుణుల హెచ్చరిక.. ఒక చిన్న పొరపాటు జీవితాంతం నష్టం..

ఈ విషయంలో అనుభవజ్ఞులు.. ఇమిగ్రేషన్ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.. ఐ 485 ఆధారిత ఈఏడి వాడితే వచ్చే ప్రధాన సమస్యలను వారు వివరిస్తున్నారు.

ఒకసారి మీరు గ్రీన్ కార్డ్ ఆధారిత ఈఏడిని ఉపయోగిస్తే మీ విద్యార్థి ఎఫ్1 వీసా రద్దు అవుతుంది ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కారణం వల్ల గ్రీన్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురైతే మీరు అమెరికాలో ఉండడానికి ఎలాంటి చట్టపరమైన ఆధారం ఉండదు. గ్రీన్ కార్డ్ ఈఏడీలు రావడం కూడా ప్రస్తుతం చాలా ఆలస్యం అవుతుంది. అడ్వాన్స్ పరోల్ లేకుండా దేశం దాటితే మళ్ళీ లోపలికి రావడం క్లిష్టంగా మారుతుంది.

సురక్షితమైన మార్గం ఏది?

అమెరికా ఇమిగ్రేషన్ నిపుణుల మెజారిటీ అభిప్రాయం ప్రకారం.. ఓపిటి మార్గమే అత్యంత సురక్షితం ఓపిటి ద్వారా పనిచేస్తే మీరు ఎఫ్1 విద్యార్థిగానే పరిగణించబడతారు. దీనివల్ల మీ విద్యా సంబంధిత హక్కులు భద్రంగా ఉంటాయి గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదురైన మీ స్టూడెంట్ వీసా మిమ్మల్ని కాపాడుతుంది. నిబంధనలు ఉన్నప్పటికీ అధికారికంగా ఓపిటి ద్వారా అనుభవం గడించడం కంపెనీల దృష్టిలో కూడా మీ నమ్మకాన్ని కలిగిస్తుంది

జాగ్రత్త ప్రాణధారం

గ్రీన్ కార్డ్ బ్యాక్ లాక్స్ అనేవి భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. నిరీక్షణ నిరాశతో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును అంధకారం చేయకూడదు. చట్టపరమైన పరిమితులకు లోబడి ఓపిటి మార్గంలో వెళ్లడమే దీర్ఘకాలంలో విద్యార్థులకు శ్రేయస్కరం.

Tags:    

Similar News