• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పెరుగుతున్న గుండెపోటు.....

పెరుగుతున్న గుండెపోటు.. ఆందోళనలో భారతీయులు..!

By - Tupaki Desk
Update: 2022-12-10 05:36 GMT
గుండెపోటుతో మరణించారనే వార్త ఒకప్పుడు చాలా అరుదుగా వినిపించేది. అది కూడా ముసలితనంలో ఉన్నవారిలో కన్పించేది. కానీ ఇప్పుడు మాత్రం గుండెపోటు అనే మాట ప్రతి నిత్యం ఎక్కడో ఒక చోట వినాల్సి వస్తుంది. అది కూడా చిన్న.. పెద్ద అని తేడా లేకుండా వస్తుండటం ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇటీవల కాలంలో భారత్ లో గుండెపోటు మరణాలు.. స్ట్రోక్ కు గురవుతున్న వారి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగిపోయిందని లోకల్‌ సర్కిల్స్ సర్వేలో వెల్లడైంది. 357 జిల్లాలకు చెందిన 32 వేల మంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించి నివేదికను తయారు చేశారు. ఈ సర్వే ప్రకారం.. తమ పరిచయస్తుల్లో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువ కోవిడ్ బారిన పడిన వారు 61శాతం ఉన్నారని చెప్పారు.

28 శాతం మంది తీవ్రంగా వైద్య పరిస్థితులు అనుభవించినప్పటికీ కోవిడ్ బారిన పడలేదని వెల్లడించారు.  62 శాతం మంది రెండు సార్లు టీకాలు వేయించుకున్నట్లు చెప్పారు. 11 శాతం మంది ఒకే డోస్ టీకాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే 8 శాతం మంది టీకాలు వేసుకోలేదని తెలిపారు.

గుండెపోటుకు గురైన వారిలో టీకాలు వేయించుకున్న వారితో పాటు వేయించుకోని వారు సైతం  ప్రభావితమైనట్లు సర్వేలో వెల్లడైంది. సుమారు 51 శాతం మంది పౌరులు గత రెండేళ్లలో తమ సన్నిహితులు ఒకరు లేదా అంత కంటే ఎక్కువ మంది గుండెపోటు లేదా మెదడు స్టోక్.. రక్తం గడ్డకట్టడం.. నరాల సంబంధిత సమస్యలు.. క్యాన్సర్ సంబంధిత వ్యాధితో.. ఆకస్మిక పరిస్థితులకు గురైనట్లు వెల్లడించారు.

ఆరోగ్యవంతమైన యువకులు.. మధ్య వయస్సు గలవారు.. పురుషులు.. స్త్రీలు అనేక మంది మరణించినట్లు వెల్లడించారు. గత మూడు నెలల కాలంలో ఈ ఆకస్మిక మరణాలు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. జిమ్.. డాన్స్ చేసేటప్పుడు.. నడక వంటి శారీరక శ్రమలో నిమగ్నమైన సమయంలో గుండెపోటుకు గురయ్యారని వెల్లడించారు.

ఈ సమయంలో వారంతా ఆందోళనకు గురి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయని పేర్కొన్నారు. అయితే కోవిడ్ టీకాలు వేయించుకున్న వారికి.. టీకాలు వేయించుకోని వారికి గుండెపోటు సంబంధిత విషయాల్లో పెద్దగా తేడా ఏమీ లేదని సర్వేలో వెల్లడైంది. అయితే టీకాలు తీసుకున్న వారు గుండెపోటుకు గురై నప్పటికీ ఎక్కువగా కోలుకున్నారని తేలింది.

తీవ్రమైన కోవిడ్ కు గురై ఆస్పత్రిలో చేరిన వారిలో 20 శాతం నుంచి 30 శాతం వరకు ట్రోపోనిన్ స్థాయిలు పెరగడం.. సిరల థ్రోంబో ఎంబోలిజం.. గుండెపోటు.. అరిథ్మియాల ద్వారా మయోకార్డియల్ ప్రమేయం ఉన్నట్లు రుజువు ఉందని ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి.

కోవిడ్ లేదా దాని సంబంధిత వ్యాధుల సమస్యలను సాధ్యమైనంత వరకు తగ్గించేలా కోవిడ్ రీఇన్‌ఫెక్షన్‌లను నివారించాల్సిన అవసరం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను లోకల్ సర్కిల్ త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ వివరాలను పరిశీలించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • HealthIssues 
  • CardiacArrest 
  • HeartAttacks 
  • UnhealthyLifestyle 
  • HeartStrokes 
  • CovidVaccination 
  • LocalCircleSurveyonHeartAttacks 

Similar News

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

Copyright @2026

Powered by Blink CMS