గూగుల్ ఇలా కూడా చేస్తుందా?

Update: 2015-09-02 10:56 GMT
సెర్చ్ ఇంజిన్ చేతిలో ఉంది కదా అని.. తమ తమ కంపెనీల విషయాలను తక్కువచేసి చూపుతూ, సొంత కంపెనీలను కావాలని ప్రోత్సహిస్తుందని.. కంపెనీల ఆర్థిక లావాదేవీలు, ఆన్ లైన్ ర్యాంకింగ్స్ వివరాలు, సేవల వివరాలు మొదలైనవి కావాలనే తప్పుగా చూపిస్తోందని అమెరికా, యూరప్ ఖండాలలో గూగుల్ పై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇదే సమయంలో భారత్ లో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయని.. ప్రజల్లో అనుమానాలు, అపనమ్మకాలు పెరిగేలా ప్రచారం చేయడంతో తమ తమ వెబ్ సైట్ల సేవలు కూడా నెమ్మదించాయని భారత్ మాట్రిమోని ఆరోపిస్తుంది.

బ్రెజిల్, మెక్సికోలలో ఉన్న సొంత కంపెనీల సేవలను ఎక్కువచేసి చూపిస్తూ... ఇతర కంపెనీల మార్కెట్ ను దెబ్బతీస్తుందని వ్యాపారవేత్తలు గూగుల్ పై ఫైరవుతున్నారు. ఈ స్థాయిలో చాలా సమస్యలు తలెత్తాయని పలు అంతర్జాతీయ కంపెనీలు గూగుల్ పై నిప్పులు చెరుగుతున్నాయి. దీంతో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం గూగుల్ తీరుపై తీవ్ర అభ్యంతారలు లేవనెత్తడంతో పాటు.. సెప్టెంబరు 10 లోపు వివరణ కోరింది.

దీనిపై స్పందించిన గూగుల్ సంస్థ నిర్వాహకులు ఈ వివరాలు అందచేయడానికి, తమ వివరణ ఇచ్చుకోవడానికి ఈ సమయం చాలదని, మరింత గడువు పొడిగించాలని కోరింది!
Tags:    

Similar News