కేసీఆర్ పుట్టిన రోజు.. ఏవీ నాటి సంబురాలు!

కానీ.. తాజాగా ఆ సంబురాలు ఎటు పోయిన‌య్‌?! అంటే.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో అధినేతే ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చిన‌ట్టు తెలిసింది.;

Update: 2026-02-17 18:14 GMT

బీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు(ఫిబ్ర‌వ‌రి 17) అంటేనే.. ఓ వేడుక‌. ఓ సంబురం. కులాల‌కు అతీతంగా.. ప‌ట్ట‌ణాలు.. న‌గ‌రాల‌కు అతీతంగా అన్ని ప్రాంతాల్లో ఒక‌ప్పు డు కేసీఆర్ పుట్టిన రోజు అంటే ఉవ్వెత్తున సంబురాలు క‌నిపించాయి. కానీ.. తాజాగా మంగ‌ళ‌వారం ఆ త‌ర‌హా సంతోషం.. ఆనందం.. సంబురం.. పెద్ద‌గా క‌నిపించ‌లేదు. పార్టీ కార్యాల‌యాల్లో `మ‌మ` అనిపించా ర‌న్న‌ది వాస్త‌వం.

సొంత మీడియాలో కూడా.. రెండు వ్యాసాలు.. ఓ 10 నిమిషాల వాయిస్ ఓవ‌ర్‌తోనే స‌రిపుచ్చారు. ఇక‌, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబురాలు చేస్తార‌ని అనుకున్నా.. అలాంటి వాతావ‌ర‌ణం కూడా క‌నిపించ‌లేదు. ఒక‌రిద్ద‌రు మాత్రం త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోని కార్యాల‌యాల్లో కేకులు క‌ట్ చేశారు. వాస్త‌వా నికి కేసీఆర్ పుట్టిన రోజును ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర స్థాయి పండుగగా బీఆర్ ఎస్ నేత‌లు చేసుకునే వారు. ఎక్క‌డిక‌క్క‌డ భారీ బ్యాన‌ర్లు.. ఫ్లెక్సీలు క‌నిపించేవి. కార్లు-షికార్లు హ‌ల్చ‌ల్ చేసేవి.

కానీ.. తాజాగా ఆ సంబురాలు ఎటు పోయిన‌య్‌?! అంటే.. మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో అధినేతే ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో కీల‌క నాయ‌కులు కూడా పెద్ద‌గా ఈ పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొన‌లేద‌ని స‌మాచారం. వ‌రుస ప‌రాజ‌యాల‌తో.. జారుడు బండ‌పై రాజ‌కీయ విన్యాసం చేస్తున్న బీఆర్ ఎస్‌కు గ‌త‌ ఏడాది కాలంలో ఏదీ క‌లిసి రావ‌డం లేదు. పైగా కేసులు చుట్టుముట్టిన ద‌రిమిలా.. ఈ వేడుక‌ల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అదేస‌య‌మంలో `జాతిపిత‌` సెంటిమెంటు కూడా వ‌ర్క‌వుట్ కాలేదు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ నాయ‌కులు జాతిపిత సెంటిమెంటును ప్లే చేశారు. ఇదేస‌మ‌యంలో కాంగ్రెస్‌దీటుగా బ‌దులిచ్చింది. దీంతో ఈ సెంటిమెంటు కూడా క‌లిసి రాలేదు. అయితే.. తెలంగాణ కోసం ఉద్య‌మించార‌న్న వాద‌న‌లో ఎవ‌రూ విభేదించ‌డం లేదు. ఏదేమైనా.. కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు కేవ‌లం కొన్ని ప్రాంతాల‌కు, కార్యాల‌యాల‌కు ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News