పవన్ కల్యాణ్‌కు అరుదైన ఛాన్స్.. బాబు సడెన్ నిర్ణయం వెనుక!
ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కావాల్సిన కీలక కార్యక్రమానికి హఠాత్తుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ హాజరయ్యారు.;
ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కావాల్సిన కీలక కార్యక్రమానికి హఠాత్తుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యా ణ్ హాజరయ్యారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం.. సీఎం చంద్రబాబు హాజరుకావాలి. కానీ.. చివరి నిమిషం లో ఆయన తన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. ఇదేసమయంలో పవన్ కల్యాణ్ కు సమాచారం ఇచ్చి.. ఆయనను సదరుకార్యక్రమానికి పంపించారు. దీంతో కార్యక్రమం సజావుగా సాగిపోయింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సాయంత్రం రాష్ట్రానికి వచ్చారు. రెండు రోజులు ఆమె విశాఖప ట్నంలోనే ఉండనున్నారు. విశాఖ తీరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ-2026ను ఆమె వీక్షిం చనున్నారు. ప్రపంచ దేశాల నుంచి వందల సంఖ్యలో నౌకలు విశాఖకు వచ్చాయి. బుధవారం ఈ కార్య క్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇదిలావుంటే.. ప్రొటోకాల్ ప్రకారం.. రాష్ట్రానికి వచ్చి న రాష్ట్రపతికి గవర్నర్, సీఎం, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యేలు స్వాగతం పలకాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో షెడ్యూల్ జాబితాలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్.. సీఎం చంద్రబాబు.. విశాఖ నగర మేయర్ ఇతర ప్రజాప్రతినిధులు... అధికారులు ఉన్నారు. కానీ, మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి రావడానికి ముందు.. చంద్రబాబు ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయనకు ఒంట్లో నలతగా ఉందని కొందరు చెప్పినా.. అధికారికంగా ఈ పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఢిల్లీ నుంచి బయలు దేరిపోయారు.
దీంతో వెనువెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. వెంటనే విశాఖకు వెళ్లాల్సిందిగా ఆయనను కోరడంతో సీఎం మాటను గౌరవిస్తూ.. పవన్ కల్యాణ్.. వెంటనే గన్నవ రం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. ఆయన విమానం దిగే సమయానికి.. రాష్ట్రపతి విమానం వచ్చి ఉంది. అటు నుంచి అటే.. రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ అరుదైన అవకాశం పట్ల పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేసినట్టు జనసేన వర్గాలు తెలిపాయి.