ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న హ్యాపీస్‌.. రీజ‌నేంటంటే!

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు చాలా రోజుల త‌ర్వాత‌.. స‌భ‌లో సంతోషం వ్య‌క్తం చేశారు.;

Update: 2026-02-17 18:13 GMT

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు చాలా రోజుల త‌ర్వాత‌.. స‌భ‌లో సంతోషం వ్య‌క్తం చేశారు. సాధా ర‌ణంగా స‌భ‌ను రోజూ ఆయ‌న సంతోషంగానే ప్రారంభిస్తారు. కానీ, స‌భ్యుల హాజ‌రు, వారు స‌భ‌లో ఎక్కువ సేపు ఉండ‌క‌పోవ‌డం.. వంటి విష‌యాల‌పై త‌ర‌చుగా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిం దే. ముఖ్యంగా వైసీపీ స‌భ్యులు స‌భ‌కు రాకుండానే హాజ‌రు పుస్త‌కంలో సంత‌కాలు చేసి వెళ్లిపోవ‌డంపై ఆగ్ర‌హంతో ఉన్నారు.

ఒక్క వారిపైనే కాదు.. కూట‌మి పార్టీల్లోని కొంద‌రు ఎమ్మెల్యేల వైఖ‌రిపైనా స్పీక‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నా రు. స‌భ‌కు వ‌చ్చి.. ప‌ట్టుమ‌ని 10 నిమిషాలు కూడా కూర్చోకుండా.. లాబీల్లో తిరుగుతున్నార‌ని.. మీడియాతో చిట్ చాట్ పెట్టుకుంటున్నార‌ని ఆయ‌న త‌ర‌చుగా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తు త స‌మావేశాల్లో స‌భ్యుల‌కు డిజిట‌ల్ హాజ‌రును ప్ర‌వేశ పెట్టారు. దీనిపై మంగ‌ళ‌వారం నాటి స‌భ‌లో అయ్య న్న మాట్లాడుతూ.. సంతోషం వ్య‌క్తం చేశారు.

అంతేకాదు.. డిజిటల్ అటెండెన్సు ద్వారా.. కేవ‌లం హాజరు మాత్ర‌మే కాకుండా.. స‌భ్యులు స‌భ‌లో ఎంత సేపు ఉంటున్నార‌న్న‌ది కూడా నిమిషాలు.. సెక‌నుల‌తో స‌హా త‌న‌కు తెలిసిపోతోంద‌ని చెప్పారు. ఈ విధానంతో అయినా.. స‌భ‌కు వ‌చ్చే స‌భ్యుల పెరుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు. ఇక‌, స‌భ‌కు రాని స‌భ్యుల‌ను రీకాల్ చేసే విధానం ఉండాల‌ని తాను బ‌లంగా కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 8 దేశాల్లో ఈ విధానం అమ‌ల్లో ఉంద‌ని అధికారులు చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు.

ప్ర‌జ‌లు క‌ట్టే ప‌న్నుల ద్వారా న‌డుస్తున్న అసెంబ్లీకి హాజ‌రు కావ‌డం స‌భ్యుల బాధ్య‌త అని అయ్య‌న్న వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన వారు.. సొంత అజెండాలు పెట్టుకుని స‌భ‌కు రాకుండా ఉంటే ఇక‌, వారికి స‌భ్య‌త్వం ఎందుక‌ని.. దీనిపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల‌ని కూడా పేర్కొన్నారు. పార్ల‌మెంటులోనూ దీనిపై ప్ర‌శ్నించాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. చ‌ట్టం తీసుకువ‌చ్చి.. స‌భ్యుల‌ను అన‌ర్హుల‌ను చేసే విధానం తీసుకురావాల‌ని అయ్య‌న్న వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News