• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈయన కూడా మన రామ్ గోపాల్...

ఈయన కూడా మన రామ్ గోపాల్ వర్మ టైపే !

By - Tupaki Desk
Update: 2019-11-28 05:50 GMT
రామ్ గోపాల్ వర్మ ..వివాదాలకు మరు పేరు. పొద్దున్న లేచినప్పటినుండి రాత్రి పడుకునేవరకు నిత్యం ఈయనపై ఎదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా .నా రూట్ ఇదే అంటూ పోతుంటాడు. అలాగే నువ్వు తీసిన సినిమాలు ఎందుకు చూడాలి అని అడిగితే ..చూడద్దు, నిన్ను ఎవడు చూడమన్నాడు అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. వర్మ కి వివాదానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ఇకపోతే ఈయనలా  ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అనుకున్న సమయంలో నేనున్నా అంటూ మరొకరు ముందుకు వచ్చారు.

అయన మరెవరో కాదు అగ్రరాజ్యం అమెరికా ప్రెసిండెంట్ ..డోనాల్డ్ ట్రంప్. ట్రంప్ కి , వర్మ కి చాలా దగ్గరి సంబంధాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇద్దరి మైండ్ సెట్ ఒక్కటే ..ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ , మేము అనుకున్నది చేసి తీరుతాం అని ముక్కుసూటిగా వెళ్తుంటారు. ఇక తాజాగా ట్రంప్ చేసిన ఒక ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. హాలీవుడ్ సినిమా ‘రాకీ’లో ప్రముఖ నటుడు సిల్వస్టర్ స్టాలోన్.. బాక్సర్ రాకీ పాత్రలో నటించాడు. చేతికి గ్లోవ్స్ ధరించి రింగులో నిల్చున్న స్టాలోన్ ఫొటోను జాగ్రత్తగా క్రాప్ చేసిన ట్రంప్.. స్టాలోన్ తల స్థానంలో తన తలను తగిలించారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది చూసిన జనం విస్తుపోతున్నారు. నిజంగా మన ట్రంపే! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫోటోని ట్రంప్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏమిటంటే .. గత శనివారం ట్రంప్‌ ఆకస్మికంగా వాషింగ్టన్‌ బయట ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్‌ తాను ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నానని చాటేందుకు, వదంతులకు చెక్‌ పెట్టేందుకు ఫొటోను పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే,  మరోవైపు ఈ ఫొటోతో రష్యాకు హెచ్చరికలు జారీ చేసి ఉండొచ్చన్న ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. రాకీ-3 సినిమాలో రష్యాకు చెందిన విలన్‌ను హీరో మట్టికరిపిస్తాడు. ఆ విధంగా రష్యా కి హెచ్చరిక జారీచేశారు అని చర్చించుకుంటున్నారు.
Tags:    
  • Donald Trump 
  • Ram Gopal Varma 
  • Donald Trump Is Like Ram Gopal Varma 
  • Tupaki News 

Similar News

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

ఇన్‌స్టాగ్రామ్‌లో బోల్డ్ వీడియోలకు చెక్.. మెటా కొత్త రూల్స్!

2026-11-18 07:06 GMT

రేవంత్ ను పొడవడానికి ‘కోమటిరెడ్డి’ ఒక్కడు చాలు.. ‘రూ.5వేల’ మంటపెట్టాడు..

2026-11-18 07:05 GMT

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

2026-11-18 06:51 GMT

ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా.. ‘షాల్ వుయ్ మూవ్?’ అన్న మోదీ!

2026-11-18 06:50 GMT

Copyright @2026

Powered by Blink CMS