• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రామ్మోహన్‌ నాయుడికి...

రామ్మోహన్‌ నాయుడికి వాళ్లు జలక్ ఇచ్చారట..

By - Tupaki Desk
Update: 2019-04-16 04:58 GMT
టీడీపీకి కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం ఎంపీ సీటు ఈసారి జారీపోతుందా..? అనే చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ పోటీగా నిలిచారు. ఇక్కడ పార్టీల మధ్య పోరు కంటే కులాల మధ్యే అభ్యర్థుల గెలుపోటములు ఉంటుందని పోలింగ్ సరళిని బట్టి నేతలు దాదాపు నిర్ణయానికి వచ్చారు.. గతంలో జరిగిన ఎన్నికల్లో కళింగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తరువాత కింజారపు ఎర్రన్నాయుడు   ఈ నియోజకవర్గం నుంచి గెలవడంతో వెలమల స్థానంగా అవతరించింది.

1996కు ముందు ఎక్కువగా ఈ నియోజకవర్గంలో కళింగులే ప్రాతినిథ్యం వహించారు. 1996 నుంచి 2009 వరకు టీడీపీ నుంచి పోటీ చేసిన ఎర్రన్నాయుడిదే హవా సాగింది. 2009లో కళింగ సామాజిక వర్గంకు చెందిన కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ తరుపున విజయం సాధించారు. ఆ తరువాత రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ కు ఎదురుగాలి వీయడంతో 2014 ఎన్నికల్లో ఆమె పరాజయం చెందారు.

2012లో ఎర్రన్నాయడు మృతిచెందడంతో ఆయన కుమారుడు  రామ్మోహన్‌ నాయుడు 2014లో పోటీ చేశారు. ఎర్రన్నాయుడి సానుభూతి, టీడీపీ హవా సాగడంతో ఆయన గెలుపొందారు. దీంతో ఆయన ఈసారి కూడా పోటీ చేశారు. అయితే ప్రస్తుతం కళింగ సామాజిక వర్గం నుంచి దువ్వాడ శ్రీనివాస్‌ వైసీపీ నుంచి పోటీ చేశారు. ఆయన గత రెండు పర్యాయులుగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై ఉన్న సానుభూతి, వైసీపీ గాలి వీస్తున్నట్లు వార్తలు రావడంతో శ్రీకాకుళం ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నికల వరకు పరిస్థితి వేరే రకంగా ఉన్నా పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే దువ్వాడ శ్రీనివాస్‌ కు కళింగ సామాజిక వర్గం మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసిన వారు రామ్మోహన్‌ నాయుడు వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. వెలమలు రామ్మోహన్‌ నాయుడికి మద్దతు పలకగా మిగిలిన కులాల ఓట్లు చీలినట్లు అర్థమవుతోంది. దీంతో ఇక్కడ కులాల మధ్యే ఎన్నికలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే కళింగలో కొంత మంది రామ్మోహన్‌ నాయుడు వైపు మద్దతు ఇస్తే పర్వాలేదు, లేకుంటే ఈసారి దువ్వాడ శ్రీనివాస్‌ దే పైచేయి అన్నట్లుగా జిల్లాలో సమీకరణాలు మారాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
    
    
    

Tags:    
  • Rammohan Naidu 
  • 2019 Elections 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

Copyright @2026

Powered by Blink CMS