అక్బరుద్దీన్ ను గుర్తు కు వచ్చేలా చేసిన బీజేపీ ఎమ్మెల్యే
నోటికొచ్చినట్లు మాట్లాడితే నడిచే కాలం కాదిది. ఈ విషయాన్ని వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళలోనూ బీజేపీ ప్రజాప్రతినిధులు అస్సలు గుర్తించటం లేదు. తమ చేతిలో అధికారం ఉన్నంత మాత్రాన..తాము అనుకున్నట్లే అన్ని జరగవన్న విషయం పౌరసత్వ సవరణ చట్టంతో తేలిన విషయం తెలిసిందే. అంత పెద్ద మోడీ సైతం ఎన్నార్సీపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది. గాలి తమకు అనుకూలంగా వీయటం లేదన్న విషయాన్ని బీజేపీ ప్రజాప్రతినిధులు గుర్తించటం లేదు.
తాజాగా హర్యానా కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం గా మారాయి. కొన్నేళ్ల క్రితం మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని గుర్తు కు తెచ్చేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా దేశ వ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. కైతాల్ ఎమ్మెల్యే లీలా రామ్ గుర్జార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడున్నది గాంధీ.. నెహ్రూ.. మన్మోమన్ సింగ్ కాలం కాదని.. మోడీ.. అమిత్ షా రాజ్యం గా అభివర్ణించిన ఆయన.. తమకు ఒక్క సిగ్నల్ వస్తే చాలు ఒక్క గంటలో వాళ్ల పని పడతామని దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. సీఏఏ చట్టం లో ముస్లింల ను దేశం నుంచి వెళ్లగొడతారనేది వాస్తవం కాదని.. భారతీయ ముస్లింల కు ఈ చట్టం తో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అక్రమంగా విదేశాల నుంచి వచ్చిన చొరబాటుదారులు మాత్రం కచ్ఛితంగా దేశం నుంచి వెళ్లి పోవాల్సిందేనని పేర్కొన్నారు. సిగ్నల్ వస్తే గంటలో లెక్క తేలుస్తామన్న మాటలు వివాదం గా మారటమే కాదు.. కమలనాథుల కు కొత్త కష్టాన్ని తీసుకొచ్చాయని చెప్పక తప్పదు.