టీకా పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు.. ఆందోళనలో తల్లిదండ్రులు
అంతర్జాతీయంగా కరోనా కేసులు భారీ స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కేసులు ఒక్క రోజుల్లోనే లక్ష కేసులు దాటుతున్నాయి. వీటికి తోడు కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసులు కూడా అదే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన ఈ వైరస్.. భారత్ లో కూడా తన ప్రభావాన్ని చూపేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే మన దేశంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు నాలుగు వందలు దాటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉండే టీనేజర్లకు టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 15 నుంచి 18 ఏళ్లు మధ్య ఉండే వారికి వచ్చే నెల మూడో తేదీ నుంచి పంపిణీ ప్రారంభించింది.
ఇటీవల జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ టీనేజర్లకు టీకా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు కేంద్ర పేర్కొన్న దాని ప్రకారం అతి త్వరలోనే వృద్ధులకు కూడా బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. అయితే జనవరి మూడు నుంచి ప్రారంభం కానున్న పిల్లలకు టీకా పంపిణీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణా ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. టీనేజర్లకు పెద్ద మొత్తంలో ఒకేసారి టీకా ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
జనవరి మూడు నుంచి ప్రారంభం కానున్న పిల్లల టీకా పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక వేస్తుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చాలా సున్నితంగా పరిశీలిస్తుంది. ఇందుకుగానూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వివిధ శాఖలను కోఆర్డినేట్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యంగా ఈ టీకాకు లబ్ధిదారులు అయిన 15 నుంచి 18 ఏళ్ల లోపు వారిని సులభంగా గుర్తిస్తుంది. వీరంతా కాలేజీ, పాఠశాల విద్యార్థులు కావడంతో సులభంగా వారు చదువుకునే సంస్థల్లోనే వారికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఇదిలా ఉంటే టీకా ఇచ్చే విషయంపై పిల్లల తల్లిదండ్రులు ఒకింత కంగారు మొదలైంది. వ్యాక్సీన్ తీసుకుంటే పిల్లలకు సైడ్ ఎఫెక్ట్ వస్తాయేమో అని అమ్మ నాన్న ఆలోచిస్తున్నారు. టీకా తీసుకునే వారిలో ఎక్కువ మంది ఇంటర్, టెన్త్ చదివారు కావడంతో టీకా తీసున్న తరువాత దాని ప్రభావం వారి పరీక్షల మీద పడుతుందని కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం మాత్రం టీకా పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని అనుకుంటుంది.
గత కొద్ది రోజులుగా పాఠశాలలు, కళాశాలలో వైరస్ వ్యాప్తి పెరిగి ఎంతో మంది విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు చెప్తున్నారు. దీనికి తోడు వచ్చే ఫిబ్రవరిలో కేసుల సంఖ్య గరిష్ఠానికి చేరుకుంటుందని చెప్పడంతో వ్యాక్సిన్ తీసుకోక తప్పదని వాదన కూడా వినిపిస్తోంది.