మీ ఇంట్లో గేమింగ్ బూచాడి ఆరాచకం.. షాకింగ్ గా గణాంకాలు
మనం పెద్దగా పట్టించుకోని కొన్ని అంశాలు.. కాల క్రమంలో అవెంత తీవ్ర పరిస్థితులకు.. పరిణామాలకు దారి తీస్తాయన్న విషయాన్ని తెలియజెప్పే గణాంకాలుగా చెప్పాలి. సరదాగా.. టైం పాస్ కోసం షురూ అయ్యే ఆన్ లైన్ గేమించి.. రోజులు గడిచే కొద్దీ ఇది కాస్తా పెద్ద వ్యసనంగా మారటమేకాదు.. ఈ గేములు ఇచ్చే కిక్కులు మరేమీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంటారు. కొన్ని ఉదంతాల్లో చావును కూడా కొని తెచ్చుకోవటానికి ఈ గేమింగ్ ప్రియులు వెనుకాడని దుస్థితి. కరోనాకు ముందు ఆన్ లైన్ గేమింగ్ తీవ్రత ఉన్నా.. కరోనా తర్వాత.. అందునా ఆన్ లైన్ క్లాసుల జోరు పెరిగిన తర్వాత..క్లాసుల పేరుతో గేమింగ్ మీద ఫోకస్ పెంచటం ద్వారా తమను తాము నాశనం చేసుకోవటం ఎక్కువైంది.
ఇదే విషయాన్ని తాజాగా విడుదలైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం కొవిడ్ అనంతరం పిల్లల్లో ఒక రోజులో ఆన్ లైన్ గేమ్స్ కోసం వెచ్చిస్తున్న సమయం ఏకంగా 218 నిమిషాలు.. అంటే అటు ఇటుగా నాలుగు గంటలు కావటం గమనార్హం. అంతేకాదు.. లాక్ డౌన్ వేళ.. మన దేశంలో వివిధ డిజిటల్ పరికరాల్లోకి డౌన్ లోడ్ అయిన ఆన్ లైన్ గేముల సంఖ్య ఏకంగా 700 కోట్లు కావటం మరో విశేషం.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆన్ లైన్ గేమింగ్ అన్నది ఒక తీవ్రమైన వ్యసనంగా మారిందన్న దానికి నిదర్శనంగా మరో లెక్కను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2020లోఆన్ లైన్ గేములు ఆడేవారి సంఖ్య 36.5 కోట్లకు ఉంటే.. అందుకు రెండేళ్ల ముందు అంటే 2018లో ఇది 26.9 కోట్లుగా ఉంది. మరో ఏడాదిలో అంటే.. 2022 నాటికి ఆన్ లైన్ గేములు ఆడేవారి సంఖ్య ఏకంగా 51 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక.. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న 30 లక్షలకు పైగా ఉన్న యాప్స్ లో గేమింగ్ యాప్స్ సంఖ్య ఎంతో తెలుసా? 4.44 లక్షలు. అంటే దాదాపు 14 శాతం యాప్ లు ఆన్ లైన్ గేమింగ్ వే అన్న మాట.
ఈ ఆన్ లైన్ గేముల మత్తులో పడి చదువును నిర్లక్ష్యం చేసే వారు చాలా మందే ఉన్నారు. తాజాగా అందుతున్న గణాంకాల ప్రకారం దేశంలోఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ విలువ 2023 నాటికి రూ.15,500 కోట్లుగా ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచంలో దక్షిణ కొరియా తర్వాత మన దేశంలోనే అత్యధిక గేమర్స్ ఉన్నారన్న చేదు నిజం తాజాగా అమెరికాకు చెందిన సంస్థ చేసిన సర్వేలో వెల్లడైంది. గడిచిన ఏడాదిన్నరగా అంతకంతకూ పెరుగుతున్న గేమింగ్ వ్యసనం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆన్ లైన్ గేమింగ్ వ్యవసానానికి బానిస అయిన వారు.. తమ శారీరక.. సామాజిక.. భావోద్వేగ ఆరోగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుందన్న విషయాన్ని చెబుతున్నారు. నిద్ర పోకుండా రాత్రివేళ అదే పనిగా ఆడటం ద్వారా ఇతరత్రా అనారోగ్యాలను తెచ్చి పెట్టుకుంటున్నారని చెబుతన్నారు. ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం బారిన పడితే..దాని నుంచి బయట పడటం అంత తేలికైన విషయాన్నిపిల్లలకు విడమర్చి చెప్పటం ద్వారా అంతో ఇంతో మార్పు ఉంటుందని చెబుతున్నారు. సో.. ఆన్ లైన్ గేమింగ్ మీద ఆసక్తి ఉంటే.. వీలైనంత త్వరగా దాని నుంచి బయటకు వచ్చేలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉందన్న మాట నిపుణుల నోటి నుంచి వస్తోంది. పారాహుషార్.