అటవీశాఖ సమర్పించు నక్కల జల్లికట్టు!

Update: 2017-01-20 09:54 GMT

ప్రస్తుతం తమిళనాడును అల్లకల్లోలం చేస్తున్న విషయం జల్లికట్టు. ఈ ఒక్క విషయంతో ప్రస్తుతం తమిళనాడు అట్టుడుకుతుంది. తమిళనాట మొదలైన ఈ విషయం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. జల్లికట్టు ఏమాత్రం మంచి సంప్రదాయం కాదని ఒకవర్గం అంటుంటే... ఇది తమిళనాడు సంప్రదాయమని, పెటాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నవారు మరికొందరు. ఈ క్రమంలో జల్లికట్టుకు అనుకూలంగా రోజు రోజుకీ మద్దతు పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా "నక్కలతో జల్లికట్టు" వెలుగులోకి వచ్చింది.

ఏ జల్లికట్టు విషయంపై తమిళనాడు మొత్తం అట్టుడుకుందో అదే తమిళనాడులోని సేలం జిల్లాలోని చిన్నమనకైన్ పాల్యం అనే గ్రామంలో నక్కలతో జల్లికట్టు ప్రతీ ఏడాది జరుగుతూనే ఉంది. అది కూడా అటవీశాఖ అధికారుల సమక్షంలో జరగడం మరో విశేషం. ప్రతీ ఏటా సంక్రాతి నెలలో ఈ ఆట జరుగుతుంది. ఈ నక్కల జల్లికట్టు ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ నక్కల జల్లికట్టు కోసం ముందుగా అడవినుంచి ఒక నక్కను తీసుకొచ్చి ఆలయంలో పూజలు చేసి ఆటకు సిద్దం చేస్తారు. ఈ సమయంలో ఆ నక్క ఎవరినీ కరవకుండా నోటికి గట్టిగా తాడుతో కట్టేస్తారు. అలాగే ఎక్కడికీ పారిపోకుండా ఒక కాలును తాడుతో కడతారు. అనంతరం అది పరుగెడుతూ ఉంటే... దాని వెనక పరిగెత్తి దాన్ని పట్టుకున్నవారి ఇందులో విజేత. అయితే ఆట ముగిసిన అనంతరం ఆ నక్కను అధికారుల సమక్షంలో తిరిగి ఫారెస్ట్ లో వదిలేస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News