పాక్ అక్రమిత కశ్మీర్ రగిలిపోతోంది

Update: 2016-07-27 16:44 GMT
పాక్ అక్రమిత కశ్మీర్ లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరు వినిపిస్తే చాలు.. అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఎంత అధికారం చేతిలో ఉండే ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఏమిటంటూ అక్రమిత కశ్మీర్ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఇంతలా షరీఫ్ మీద అక్రమిత కశ్మీరీలకు కోపం రావటానికి సమంజసమైన కారణం లేకపోలేదు. ఆ మధ్యన జరిగిన సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఫలితాల ప్రకటన ఈ నెల 21న విడుదలయ్యాయి. ఈ ఫలితాలు నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ పార్టీకే అత్యధిక స్థానాలు దక్కాయి. మొత్తం 42స్థానాలకు 32 స్థానాల్లో నవాజ్ పార్టీ గెలిచినట్లుగా తేలింది. దీనిపై ఆక్రమిత కశ్మీరాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఐఎస్ ఐ సహకారంతో తమను బెదిరించి.. రిగ్గింగ్ కు పాల్పడి షరీఫ్ నాటకాలు ఆడుతున్నట్లుగా వారు వాపోతున్నారు. ఓటరు లిస్ట్ లో పేరున్న వారికే ఎన్నికల్లో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

ఎన్నికలు పారదర్శకంగా జరగలేదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ విపక్షాలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈనిరసన ర్యాలీకి ప్రజల నుంచి స్పందన పెద్ద ఎత్తున రావటం గమనార్హం. షరీఫ్ పార్టీ చేతిలో ఓటమి చెందిన ఆల్ జమ్ముకశ్మీర్ ముస్లిం లీగ్ పార్టీ నిర్వహించిన నిరసనకు అక్కడి రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. ఎన్నికల్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Tags:    

Similar News