మన దీపావళికి అంతర్జాతీయ గుర్తింపు
ఇదిలా ఉంటే ఢిల్లీలో యునెస్కో నిర్వహిస్తున్న తాజా సమావేశంలో యునెస్కో గుర్తింపు కోసం వచ్చిన అనేక ప్రతిపాదనలను కూడా కమిటీ ప్రతిపాదిస్తోంది.;
భారతీయులకు దీపావళి పండుగ ఎంతటి ప్రత్యేకమో వేరేగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా పెద్దా అంతా కలసి దీపావళి వేడుకను ఎంతో సంబరంగా చేసుకుంటారు. కటిక అమావాస్య రోజున వచ్చే వెన్నెల రోజుగా దీపావళిని అంతా భావిస్తారు. అలాంటి భారతీయుల ఆనందాల పండుగ అయిన దీపావళిని అంతర్జాతీయంగా గుర్తించారు ఏకంగా యునెస్కో గుర్తింపు ఈ పండుగకు దక్కడం భారతీయులకు గర్వకారణంగా చెప్పాల్సిందే.
ఆ జాబితాలో :
దీపావళి పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చారు. ఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన కీలకమైన ఒక సమావేశంలో యునెస్కో ప్రతినిధులు ఈ మేఅకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాన్ని కూడా భారత్ లో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం ఒక ప్రత్యేకతగా ఉంది. ఇక ఈ సమావెశాలు ఈ నెల 8న ప్రారంభం అయ్యాయి. ఈ నెల 13 దాకా దాదాపుగా వారం రోజుల పాటు కొనసాగుతాయని అంటున్నారు.
యునెస్కో గుర్తింపులో :
ఇదిలా ఉంటే ఎంతో విశిష్టమైన సాంస్కృతిక వారసత్వం కలిగిన భారత్ లో నుంచి యునెస్కో ఇప్పటికే 15 అంశాలకు సంబంధించి వారసత్వ గుర్తింపుని ఇచ్చి ఎంతో గౌరవించింది. వాటిలో భారత్ లో జరిగే మహా కుంభమేళ, కోల్ కతాలోని దుర్గా దేవి పూజ, గుజరాత్ లోని గర్భా డ్యాన్స్, యోగా, వేద పఠనం, రామ లీల వంటి సాంస్కృతిక వారసత్వ అంశాలు ఎన్నో ఉన్నాయి.
తాజా సమావేశంలో :
ఇదిలా ఉంటే ఢిల్లీలో యునెస్కో నిర్వహిస్తున్న తాజా సమావేశంలో యునెస్కో గుర్తింపు కోసం వచ్చిన అనేక ప్రతిపాదనలను కూడా కమిటీ ప్రతిపాదిస్తోంది. ఇక ఏకంగా 80 దేశాల నుంచి 67 రకాల ప్రతిపాదనలు యునెస్కో ముందుకు వచ్చాయి. ఆ ప్రతిపాదనలను యునెస్కో సీరియస్ గా పరిశీలిస్తోంది. వీటి మీద ఈ సమావేశాలలో కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి.
సర్వత్రా హర్షం. :
ఇక మన దీపావళికి యునెస్కో గుర్తింపు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ దీని మీద ఆనందం వ్యక్తం చేశారు. ఇది దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఒక గర్వకారణం అన్నారు. మరో వైపు చూస్తే దేశంలో అడుగడుగునా ఒక కల్చర్ ఉంది. ఒక విశేషం ఉంది. ఇక ప్రత్యేకత ఉంది. ఇప్పటిదాకా యునెస్కో దేశంలో గుర్తించిన అంశాలు కేవలం పదిహేను మాత్రమే. కానీ ఎన్నో ఉన్నాయని అంటున్నారు. వాటికి కూడా ఆనున్న రోజులలో యునెస్కో గుర్తింపు కలగాలని అంతా కోరుకుంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో ఏ అంశాలు అంతర్జాతీయ గుర్తింపుని అందుకుంటాయో.