లోక్ సభలో రచ్చ రేపిన మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం

రాహుల్ గాంధీ చెప్పిన విషయం ప్రకారం చూస్తే సిక్కిం సమీపంలోని డోక్లామ్ ట్రై జంక్షన్ లో భారత భూభాగంలోకి నాలుగు చైనీస్ ట్యాంకులు ప్రవేశించి ఓ పర్వత శ్రేణిని ఆక్రమించుకున్నాయని ఉంది.;

Update: 2026-02-03 03:15 GMT

లోక్ సభలో రచ్చ రేపింది ఒక పుస్తకం. దానికి రాసిన వారు మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే. ఆయన ఇంకా ఆ పుస్తకాన్ని ఎక్కడా ప్రచురించలేదు కూడా. అయితే ఆ పుస్తకంలో కొన్ని అంశాల గురించి ఒక మాగజైన్ లో కధనంగా వచ్చిందని అంటున్నారు. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ఆధారంగా చేసుకుని పార్లమెంట్ లో మాట్లాడారు, దాంతో సభలో తీవ్ర మైన గందరగోళం చెలరేగింది. సభ అనేక సార్లు వాయిదా పడి చివరికి సభా కార్యక్రమాలు సాగలేదు.

ఇంతకీ ఏముంది అందులో :

ఇంతలా లోక్ సభలో ప్రకంపనలు పుట్టించిన మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన పుస్తకంలో ఏముంది అంటే రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ తాను చేప్పబోయేది దేశ భద్రత గురించి అన్నారు. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రక్షణ మంది రాజ్ నాధ్ సింగ్ కి ఎంతో ఇబ్బందిగా ఉన్నా తాను మాట్లాడి తీరుతాను అంటూ సభలో ఆ పుస్తకం లోని అంశాలను గురించి ప్రస్తావించారు. చైనా భారత్ లోని భూ భాగాలను ఆక్రమిస్తోంది అన్నది రాహుల్ ఆ పుస్తకం నుంచి తీసుకున్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం మీద చేసిన తీవ్రమైన ఆరోపణగా ఉంది. దాంతో అధికార పక్షం నుంచి ఒక్కసారిగా సభ్యులు లేవడం ఇటు విపక్షం రాహుల్ కి మద్దతు ఇవ్వడంతో సభలో గందరగోళమే సాగింది.

చైనా దురాక్రమణ అంటూ :

రాహుల్ గాంధీ చెప్పిన విషయం ప్రకారం చూస్తే సిక్కిం సమీపంలోని డోక్లామ్ ట్రై జంక్షన్ లో భారత భూభాగంలోకి నాలుగు చైనీస్ ట్యాంకులు ప్రవేశించి ఓ పర్వత శ్రేణిని ఆక్రమించుకున్నాయని ఉంది. ఈ మేరకు మాజీ ఆర్మీ చీఫ్ నరవణే ఇందులో వివరించారని ఆయన ఉటంకించారు. ఇది దేశ భద్రతను సవాల్ చేసే విషయం అని రాహుల్ గాంధీ అన్నారు. దీని మీద చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఇద్దరూ రాహుల్ ప్రసంగానికి అభ్యంతరం తెలిపారు. ప్రచురణ కూడా కానీ పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం అని అమిత్ షా అన్నారు. అయితే ఇది జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి తాను ఈ విషయాన్ని లేవనెత్తుతున్నానని రాహుల్ గాంధీ సమర్ధించుకున్నారు.

ఊహల సారాంశం అంటూ :

ఔయితే రాహుల్ గాంధీ చైనా ఆక్రమణల గురించి మాట్లాడినది పూర్తిగా ఊహాత్మక సారాంశమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొట్టి పారేశారు. వాస్తవంగా సరైనది కాదని అన్నరు. రాహుల్ ఈ విధంగా సభను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. రాహుల్ గాంధీ దేశ సైన్యాన్ని అవమానించకూడదని అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. మొత్తం మీద చూస్తే ఒక మాజీ ఆర్మీ అధికారి పుస్తకం లోక్ సభలో అతి పెద్ద రభసకు కారణం అయింది. ఇంతకీ భారత్ భూ భాగంలో చైనా చొరబడిందా, ఆక్రమించిందా అన్న దానికి అధికార పక్షమే సరైన క్లారిటీ ఇవ్వాలని అంతా కోరుతున్నారు.

Tags:    

Similar News