మెరుపు దెబ్బకి మెరిసిన ఈఫిల్ టవర్… నెట్టింట వైరల్ వీడియోలు!
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రకృతి సృష్టించిన వింత విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ప్రకృతి సృష్టించిన వింత విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వేడిగాలులతో అల్లాడిపోయిన పారిస్ ప్రజలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పెద్ద ఉపశమనం లభించింది. అయితే, ఈ క్రమంలో వచ్చిన భారీ తుఫాను వల్ల ఆకాశాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఒక భీకరమైన పిడుగు, నేరుగా ప్రపంచ ప్రసిద్ధ ఈఫిల్ టవర్‌ను తాకింది. ఈ అద్భుతమైన దృశ్యం కెమెరాలో రికార్డ్ అవ్వడంతో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
ఆకాశాన్ని చీల్చిన పిడుగు:
తీవ్రమైన ఉక్కపోత తర్వాత పారిస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం మొదలైంది. ఆ సమయంలో పారిస్‌లో ఉంటున్న అమెరికన్ ఫొటోగ్రాఫర్ క్రిస్టల్ కెన్నీ తన కెమెరాతో ఒక అద్భుతాన్ని బంధించారు. ఇక విద్యుత్ దీపాల వెలుగుల్లో మెరిసిపోతున్న ఈఫిల్ టవర్‌పైకి ఒక భారీ మెరుపు నేరుగా వచ్చి పడింది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో రావడమే ఆలస్యం, లక్షలాది మంది దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఈఫిల్ టవర్‌కి ఏదైనా అయిందా?:
పిడుగు అంత పెద్దగా పడితే ఈఫిల్ టవర్‌కి ఏమీ కాలేదా? అని చాలామందికి అనుమానం రావచ్చు. కానీ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం, ఈఫిల్ టవర్‌ను దాదాపు 330 మెట్రిక్ టన్నుల ఇనుముతో పక్కా ప్లానింగ్‌తో నిర్మించారు. ఇక ఇలాంటి భీకరమైన మెరుపులను, పిడుగులను తట్టుకునే శక్తి ఈ కట్టడానికి ఉంది. అందుకే అంత పెద్ద పిడుగు పడినా టవర్‌కు ఎలాంటి నష్టం జరగలేదు సరే కదా, ఆ మెరుపు వెలుతురులో టవర్ మరింత అందంగా కనిపించింది.
భయాందోళనలో పారిస్ ప్రజలు:
వాతావరణం చల్లబడినందుకు ప్రజలు రిలీఫ్ ఫీల్ అవుతున్నప్పటికీ, ఈ అకస్మాత్తు మార్పు వారిని భయాందోళనలకు గురిచేస్తోంది. పారిస్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వింత శబ్దాలతో పిడుగులు పడ్డాయి. ఇక రాబోయే గంటల్లో భారీ వడగండ్ల వాన పడే అవకాశం ఉందని, ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని హెచ్చరించింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉందని అధికారులు అలర్ట్ చేశారు.
ప్రకృతి అనుకుంటే క్షణాల్లో ఎలాంటి వింతనైనా సృష్టించగలదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈఫిల్ టవర్‌పై పిడుగు పడిన విజువల్స్ ఒక పక్క భయపెడుతున్నా, చూడ్డానికి మాత్రం ఒక అద్భుత దృశ్యంలా ఉన్నాయి.ఇక ప్రస్తుతం అధికారులు ప్రజలను ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఏదేమైనా ఈఫిల్ టవర్ మెరుపు వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను రూల్ చేస్తోంది..