'వీర‌మ‌హిళ‌' గా క్రాంతి... ఆర్డ‌రే త‌రువాయి.. !

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం క్రాంతికి అవ‌కాశం ల‌భించ‌క‌పోయినా.. త్వ‌ర‌లోనే ఆమెను వీర మ‌హిళా విభాగం రాష్ట్ర నాయ కురాలిగా నియ‌మించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Update: 2026-10-20 06:01 GMT

జ‌న‌సేనలో కీల‌క నాయ‌కురాలిగా ఉన్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుమార్తె.. క్రాంతికి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చోటు ల‌భించ‌లేదు. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రిలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తార‌ని.. కుదిరితే రాజ‌మండ్రి నుంచే ఆమె నామినేష‌న్ వేసే అవ‌కాశం ఉంద‌ని ఎన్నిక‌ల‌కు ముందు వ‌రకు ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. రాజ‌మండ్రి స్థానాన్ని కూట‌మి పొత్తులో భాగంగా బీజేపీ ద‌క్కించుకోవ‌డంతో జ‌న‌సేన‌కు అవ‌కాశం లేకుండా పోయింది. ఆ త‌ర్వాత‌.. క్రాంతి వ్య‌వ‌హారంపై పార్టీలో చ‌ర్చించార‌ని తెలిసింది.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం క్రాంతికి అవ‌కాశం ల‌భించ‌క‌పోయినా.. త్వ‌ర‌లోనే ఆమెను వీర మ‌హిళా విభాగం రాష్ట్ర నాయ కురాలిగా నియ‌మించ‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై అన్ని వ‌ర్గాల నుంచి ప‌వ‌న్ కల్యాణ్ స‌మా చారం సేక‌రించార‌ని కూడా అంటున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కావ‌డం.. బ‌ల‌మైన బ్యాక్ గ్రౌండ్‌తో పాటు గ‌ట్టి వాయిస్ కూడా ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి క్రాంతిని ప్రిపేర్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని అంటున్నారు.

ఇప్ప‌టికిప్పుడు క్రాంతికి.. వీర మ‌హిళ రాష్ట్ర అధ్య‌క్షురాలుగా ప‌దవిని కేటాయించ‌డం ద్వారా ముద్ర‌గ‌డ కుటుంబం నుంచి మ‌హిళ‌కు ప్రాధాన్యం ఇచ్చార‌న్న సంకేతాలు పంపించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఆమెను తొలుత వీర మ‌హిళా విభాగానికి అధ్య‌క్షురాలిని చేయ‌నున్నార‌ని.. అనంత‌రం.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తూర్పుగోదావ‌రి జిల్లాలో అసెంబ్లీ సీటుకూడా ఖాయం చేస్తార‌ని అంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నే క్రాంతి పార్టీకి అండ‌గా నిలిచార‌ని చెప్పారు. త‌న తండ్రిని ఎదిరించ‌డం ద్వారా.. ఆమె కాపు సామాజిక వ‌ర్గంలో సంచ‌ల‌నం సృష్టించారు.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే ఉంటున్నా.. త్వ‌ర‌లోనే ఆమె విజ‌య‌వాడ‌కు మకాం మారుస్తార‌ని..అప్ప‌టి నుంచి తూర్పుగోదావ‌రి స‌హా.. రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన వీర‌మ‌హిళా విభాగాన్ని ఎంగేజ్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కాపు సామాజిక వ‌ర్గంలో పురుష నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. క్రాంతి వంటి బ‌ల‌మైన మ‌హిళా నాయ‌కురాలు అవ‌స‌రం ఉంద‌ని అంచ‌నా వేశారు. త‌ద్వారా మ‌హిళా ఓటు బ్యాంకును ముఖ్యంగా సానుకూల ధోర‌ణిలో ఉన్న కాపు మ‌హిళ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే క్రాంతి వ్య‌వ‌హారం జ‌న‌సేన‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News