ఎల్ నినో అలెర్ట్... నీరు విద్యుత్ పొదుపు చేయాల్సిందే !

ఇక తెలంగాణా రాష్ట్రానికి అవసరమైన తాగునీటి పరిమాణం 400 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ప్రభుత్వం అంటోంది.

Update: 2026-10-20 04:03 GMT

ఎల్ నినో ప్రభావంతో తెలంగాణా ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం అయింది. ఆరుగురు మంత్రులతో ఈ మేరకు ఒక కమిటీని వేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఎల్‌నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని నియామకం చేసింది. ఈ కమిటీ నిరంతరం ఎల్ నినో వల్ల కలిగే ప్రభావాలను పర్యవసానాలను కూడా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. కంటిన్యూస్ గా మోనిటరింగ్ చేస్తుంది. అంతే కాదు నీరు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తోంది. అలాగే రబీ పంటలపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.

దుద్దిళ్ళ కీలక వ్యాఖ్యలు :

ఇదిలా ఉంటే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి, ఎండలు పెరిగే పరిస్థితులు ఉంటాయని తెలంగాణా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంటున్నారు. అందువల్ల ప్రజలు అంతా జాగ్రత్త పడాలని కోరారు. . ప్రకృతి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్‌లో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని రైతులను ఆయన కోరారు. పొదుపు సూత్రాన్ని నీటి వనరుల విషయంలోనూ విద్యుత్ విషయంలోనూ అంతా పాటించలని ఆయన సూచించారు.

సగానికి సగం లోటు :

ఇక తెలంగాణా రాష్ట్రానికి అవసరమైన తాగునీటి పరిమాణం 400 టీఎంసీలు కాగా ప్రస్తుతం 200 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని ప్రభుత్వం అంటోంది. దీనికి ప్రధాన కారణం ఓవర్‌వెల్స్‌ ద్వారా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని చెబుతోంది. అంతే కాదు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బోరు బావులు ఎండిపోతున్నాయని కూడా తెలియచేస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలంగాణా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అలాగే ప్రజలు కూడా సహకరించాలని కోరుతోంది.

కొత్త బోర్లు వద్దు :

ఇక మీదట తెలంగాణా రాష్ట్రంలో కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వరాదని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈసారి వరి సాగుని బాగా తగ్గించాలని రైతులకు సూచిస్తోంది. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను వేయాలని కోరుతోంది. అలాగే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ వ్యూహాలు అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

షవర్ల స్నానాలకు బదులుగా :

చాలా మంది షవర్ల వద్ద స్నానాలు చేయడం అలవాటు చేసుకున్నారు. ఇది ఇటీవల దశాబ్దాలలో బాగా పెరిగింది. అయితే నీటి కొరత కారణంగా షవర్ల స్నానాలు వద్దు అని ప్రభుత్వం చెబుతోంది. షవర్లకు బదులుగా బకెట్లు వాడటం పైపులకు బదులు మగ్గులతో నీటిని వినియోగించడం వంటి నీటి ఆదా పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ చూసినపుడు ఎల్ నినో వల్ల రానున్న రోజులలో మరెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నది అయితే జనంలో చర్చగా ఉంది.

Tags:    

Similar News