యరపతినేని దెబ్బ ...మూడు పట్టణాలు...91 వార్డులు ఏకగ్రీవం !

ఇక చూస్తే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నారు. తన నియోజకవర్గాన్ని ఆయన టీడీపీకి కంచుకోట చేశారు.

Update: 2026-10-20 03:31 GMT

తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, అనేక సార్లు గురజాల నుంచి గెలుస్తూ వస్తున్న యరపతినేని శ్రీనివాసరావు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కొత్త రికార్డు సృష్టించారు. మూడు పట్టణాలు, 91 వార్డులలలో టీడీపీకి ఏకగ్రీవం కావడం వెనక యరపతినేని వ్యూహం ఉందని అంటున్నారు. ఇలా వైసీపీకి సార్వత్రిక ఎన్నికల తరువాత మరోసారి చిత్తు చేసిన ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయలేక వైసీపీ చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంతే కాదు సార్వత్రిక ఎన్నికల కంటే కూడా ఈసారి మరింతగా తగ్గిపోయింది అని విశ్లేషిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో హిట్ :

ఇక చూస్తే యరపతినేని శ్రీనివాసరావు టీడీపీలో కీలక ఎమ్మెల్యేగా ఉన్నారు. తన నియోజకవర్గాన్ని ఆయన టీడీపీకి కంచుకోట చేశారు. ఈ నేపథ్యంలో వచ్చిన మునిసిపాలిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు. మొత్తం పిడుగురాళ్ల మున్సిపాలిటీ దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలలో 91 వార్డులూ ఏకగ్రీవం కావడంతో గురజాల నియోజకవర్గం ఇపుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్లకు 40 వార్డులు, దాచేపల్లికి 28, గురజాలకు 23 వార్డులు ఉన్నాయి. మొత్తం 91 వార్డులు అన్నింటిలోనూ టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడం అతి పెద్ద విశేషంగా చూస్తున్నారు. ఎక్కడా ప్రత్యర్ధులు లేకుండా ఎన్నికల ఊసే లేకుండా గెలుపు పతాకను ఎగరవేసిన యరపతినేని టీడీపీలోనే హాట్ టాపిక్ అయ్యారు.

చతురతతోనే :

రాజకీయ అనుభవంతో పాటు చతురతతోనే యరపతినేని ఈ విధంగా పూర్తి స్థాయిలో ఏకగ్రీవాలు సాధించారు అని అంటున్నారు. ఎక్కడా కూడా వైసీపీ ఊసే లేకుండా చేయగలిగారు అని టీడీపీ నేతలు ఆయన్ని అభీనందిస్తున్నారు. వైసీపీ సంగతి పక్కన పెడితే సొంత పార్టీలోనూ కూటమి మిత్రులలోనూ కో ఆర్డినేట్ సాధించారని ఎక్కడా రెబెల్స్ ఎవరూ నామినేషన్లు వేయకుండా ఆయన అందరికీ కలుపుకొని పోవడం వల్లనే ఈ విజయం దక్కింది అని అంటున్నారు. ఈ విధంగా ఏకగ్రీవాలు చేసి యరపతినేని టీడీపీ పెద్దలను కూడా ఆకట్టుకున్నారని అంటున్నారు.

వైసీపీ ఎక్కడ వీక్ :

ఇక చూస్తే వైసీపీ ఇంకా వీక్ గానే ఉంది అని అంటున్నారు. ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో మూడు పట్టణాల్లోనూ బలమైన అభ్యర్థులను ఆశించిన స్థాయిలో నిలబెట్టలేకపోయింది అని అంటున్నరు. దీంతో సంస్థాగతంగా వైసీపీలో లోపాలను ఈ ఎన్నికలు బహిర్గతం చేశాయని అంటున్నారు. మరో వైపు చూస్తే దాచేపల్లిలో వైసీపీ తరఫున కొప్పుల రవికుమార్ నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 3 వేల డిపాజిట్ చెల్లించని కారణంగా ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైనట్లు సమాచారం ఉంది. ఇలా ఎన్నో లోపాలతో వైసీపీ ఉంటే టీడీపీ పకడ్బందీ వ్యూహంతో విజయ బావుటా ఎగరేసింది అని అంటున్నారు.

Tags:    

Similar News