జెన్ జెడ్ ని ఫోర్ ఫ్రంట్ లో పెట్టిన జనసేనాని

ఇక దేశంలో వీరు బలమైన ఓటు బ్యాంక్ గా ఉంటున్నారు. దాంతో వీరిని మచ్చిక చేసుకునే పనిలో అంతా ఉన్నారు. ఏపీలో చూస్తే జనసేన ఈ విషయంలో అందరి కంటే ముందు ఉన్నట్లుగా చెప్పుకోవాలి.;

Update: 2026-02-03 03:00 GMT

జెన్ జెడ్ అన్నది ఇపుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు తావిచ్చే టాపిక్ గా ఉంది. ప్రభుత్వాలను సైతం కూల్చేసే సత్తా జెన్ జెడ్ కి ఉంది.కొండలను పిండి చేసే శక్తి వీరి సొంతం. యువ కెరటాలు అని కూడా చెప్పాలి. వీరి అండ ఉంటే విజయాలే వీరు కన్నెర్ర చేసి నిప్పులు కురిపిస్తే మా త్రం విలయాలూ ప్రళయాలే. భారత్ కి ఇరుగు పొరుగు దేశాలలో జెన్ జెడ్ యువత చూపిస్తున్న జోరుతో అంతటా చర్చ సాగుతోంది. ఈ మధ్యనే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా జెన్ జెడ్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాయి. దేశంలోని జెన్ జెడ్ నిర్మాణాత్మకమైనది అని ఇటీవలనే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఇక జెన్ జెడ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కూడా పార్టీలు ఫిక్స్ అయిపోయాయి.

తొలి డిజిటల్ తరం :

జెన్ జెడ్ అంటే తొలి డిజిటల్ తరంగా చెప్పుకుంటారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన జనరేషన్ ని జెన్ జెడ్ గా పిలుస్తారు. సాంకేతికత, సోషల్ మీడియాల ద్వారా రూపుదిద్దుకున్న మొదటి నిజమైన డిజిటల్ తరంగా చెబుతారు. రానున్న రోజులలో ప్రపంచ వర్క్ ఫోర్స్ లో వీరు 30 శాతంగా ఉంటారు. ప్రభుత్వాలను నిర్ణయించే విధాతలు కూడా వీరే. జెన్ జెడ్ తరానికి సామాజిక సమస్యల గురించి తీవ్రంగా ఆలోచనల్తో పాటు ఆందోళన కూడా ఉంటుంది.

బలమైన ఓటు బ్యాంక్ :

ఇక దేశంలో వీరు బలమైన ఓటు బ్యాంక్ గా ఉంటున్నారు. దాంతో వీరిని మచ్చిక చేసుకునే పనిలో అంతా ఉన్నారు. ఏపీలో చూస్తే జనసేన ఈ విషయంలో అందరి కంటే ముందు ఉన్నట్లుగా చెప్పుకోవాలి. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసారి ఘనంగా నిర్వహించడమే కాకుండా జెన్ జెడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు.

జెన్ జీ డేగా :

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జెన్ జీ డేగా నిర్వహించాలని చూస్తున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ వేడుకలకే వారి పేరుతో నిర్వహించడం అంటే యూత్ పార్టీగా మరింత ముందుకు దూసుకుని పోవాలని జనసేన చేస్తున్న ప్రయత్నాలలో అతి ముఖ్యమైన ఘట్టంగా దీనిని భావించాలని అంటున్నారు. తద్వారా వాటిని మరింతగా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ఆ పార్టీలు కొట్టుకుపోతాయి :

ఇదిలా ఉంటే జనసేన జనరల్ బాడీ మీటింగులో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఒక కులానికో ఒక కుటుంబానికో చెందిన పార్టీ కాదని స్పష్టం చేశారు. జనసేనలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ముఖ్యమంగా మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. కులం ఆధారంగా పుట్టిన పార్టీలు కొట్టుకుని పోయాయని ఆయన చెప్పుకొచ్చారు. అంతే కాదు యూపీలో కులం మీద పుట్టిన పార్టీలు ఏమి అయ్యాయో చూడాలని అన్నారు. కుటుంబానికి చెందిన పార్టీలు కూడా నిలిచే అవకాశాలు లేవని పవన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News