జాతీయ స్థాయిలో వైసీపీకి కలిసి వచ్చేది ఎవరు ?

అయితే జాతీయ స్థాయిలో వైసీపీ ఆందోళన చేస్తే అది సోలోగానే ఉంటుందా లేక ఎవరైనా కలసి వచ్చే వారు ఉంటారా అన్నది చర్చగా ఉంది.;

Update: 2026-02-03 03:50 GMT

ఏపీలో తిరుపతి లడ్డూ ఇష్యూ ఎంత హీటెడ్ డిస్కషన్ కి దారి తీస్తోందో రాజకీయంగా ఎంతటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుందో అంతా చూస్తున్నారు. ఈ ఇష్యూ పర్యవసానాలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు పాలు కావడంతో పాటు జోగి రమేష్ మీద దాడితో వైసీపీ డిఫెన్స్ లో పడింది అని అంటున్నారు. దాంతో ఇలాగే కొనసాగితే తాము మరింత ఇబ్బంది పాలు అవుతామని వైసీపీ భావిస్తోంది అంటున్నారు. దాంతో ఈ విషయం మీద జాతీయ స్థాయిలో ఉద్యమానికి సిద్ధం కావాలని ఆలోచిస్తోంది.

మరోసారి ఢిల్లీకి :

వైసీపీ ఢిల్లీలో ఒకసారి ఉద్యమించింది. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లో. ఇంకా నెలలు కూడా కాకుండానే ఢిల్లీలో జగన్ సహా కీలక నేతలు అంతా వెళ్ళి మరీ ఆందోళనలు చేశారు. ఏపీలో తమ కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని దాడులు చేసి వేధిస్తోందని వైసీపీ ఆనాడు నిరసనలు తెలిపింది. ఈ కార్యక్రమానికి ఎస్పీకి చెందిన అఖిలేష్ యాదవ్, అలాగే ఇతర పార్టీల ఎంపీలు వచ్చారు. కాంగ్రెస్ నుంచి కానీ ఎన్డీయే నుంచి కానీ ఎవరూ హాజరు కాలేదు. ఒక విధంగా ఆ నిరసన టూ ఎర్లీ అయింది అని కూడా అన్నారు.

సరైన సమయమేనా :

అయితే ఏపీలో కూటమి పాలన ఇరవై నెలలు పూర్తి చేసుకుంది. మరి కొద్ది నెలలలో రెండేళ్ళు పూర్తి అవుతోంది. దాంతో ఇది సరైన సమయం అని వైసీపీ భావిస్తోంది. మాజీ మంత్రుల మీద దాడులు వారి ఇళ్ల మీదకు వెళ్ళడం వంటి వాటిని ఢిల్లీ వేదికగా ఎలుగెత్తి చాటాలని వైసీపీ భావిస్తోందిట. దీని కోసం ఒక యాక్షన్ ప్లాన్ ని రూపొందిస్తోంది అని అంటున్నారు.

మిత్రులు ఎవరు :

అయితే జాతీయ స్థాయిలో వైసీపీ ఆందోళన చేస్తే అది సోలోగానే ఉంటుందా లేక ఎవరైనా కలసి వచ్చే వారు ఉంటారా అన్నది చర్చగా ఉంది. వైసీపీ అయితే ఇప్పటిదాకా ఎన్డీయేలో లేదు, ఇండియా కూటమిలోనూ లేదు, న్యూట్రల్ గా ఉంటోంది. అంతే కాకుండా ఇండియా కూటమి ఆందోళనలకు మద్దతు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు, మరి ఇపుడు వైసీపీకి ఇబ్బంది వచ్చిందని ఇండియా కూటమి నేతలు వచ్చి సంఘీభావం తెలియచేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. అదే సమయంలో ఎన్డీయే కూటమి ఎంపీలు ఎటూ ఈ వైపు తొంగి చూసేది లేదు, మరి ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తే ప్లేస్ మారుతుంది కానీ హైప్ క్రియేట్ అవుతుందా అన్నదే చర్చ.

మమతా దీదీతో :

అయితే ఇటీవల మమతా బెనర్జీ పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఆమెకు గ్రీట్ చేశారు. అలాగే ఎస్పీ అఖిలేష్ యాదవ్ తో మంచి స్నేహం ఉంది అని అంటున్నారు. అలాగే ఆర్జేడీ సహా ఇతర పార్టీల నేతలతో వైసీపీకి కొంత సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. ఈ పార్టీలకు చెందిన ఎంపీలను ఆహ్వానించి ఏపీ రాజకీయ పరిణామాలు లా అండ్ ఆర్డర్ మీద ఢిల్లీ వేదికగా బిగ్ సౌండ్ చేస్తే ఆ ప్రభావం గట్టిగా ఉంటుందని వైసీపీ యోచిస్తోందిట. అంతే కాకుండా నేషనల్ మీడియాకు కూడా ఈ సందర్భంగా ఇంటర్వ్యూలు వైసీపీ అధినాయకత్వం ఇవ్వడం ద్వారా ఇష్యూని గట్టిగా చాటాలని అనుకుంటున్నారుట. మరి వైసీపీ ఢిల్లీ యాత్ర పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఉంటుందా ఉంటే డేట్ టైం ఎపుడు అన్నదే ఆసక్తికరంగా ఉంది.

Tags:    

Similar News