పౌరసత్వం కోసం బ్రిటీష్ మహిళతో పెళ్లి.. పాకిస్తానీ అరెస్ట్

అయితే బ్రిటన్ వాసులు ఇటీవల వలసలపై, ముఖ్యంగా పాకిస్తానీల అరాచకాలపై ఆందోళన బాట పట్టడంతో వారిని ఏరివేసే పనిని యూకే ప్రభుత్వం చేపట్టింది.;

Update: 2025-12-10 18:30 GMT

ఒకప్పుడు అఖండ భారతాన్ని బ్రిటన్ దేశం నిరంకుశంగా పాలించింది. బ్రిటీష్ వాళ్ల కాళ్ల కింద భారతీయులు నలిగిపోయారు. ఇప్పటికీ పాకిస్తాన్ కూడా ఒకప్పటి భారత్ లో భాగమే.. అప్పటి బ్రిటీష్ వారికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు పాకిస్తానీలు. బ్రిటన్ దేశంలోకి పాకిస్తానీ వలసలు ఎంత పెరిగాయంటే.. బ్రిటన్ లోని కొన్ని నగరాల్లో కొన్ని ఏరియాలు మొత్తం పాకిస్తాన్ వారితో నిండిపోయాయి. అక్కడికి పోలీసులు, ప్రభుత్వాలు కూడా వెళ్లనంత దుర్భేద్యంగా పాకిస్తానీ కాలనీలు బ్రిటన్ లో వెలిశాయంటే అతిశయోక్తి కాదు.

అయితే బ్రిటన్ వాసులు ఇటీవల వలసలపై, ముఖ్యంగా పాకిస్తానీల అరాచకాలపై ఆందోళన బాట పట్టడంతో వారిని ఏరివేసే పనిని యూకే ప్రభుత్వం చేపట్టింది. ఈ క్రమంలోనే ఎలాగైనా బ్రిటన్ లోనే ఉండాలని కొంత మంది పాకిస్తానీలు బ్రిటన్ మహిళలను పెళ్లి చేసుకునే పనిలో పడ్డారు.

తాజాగా యూకే పౌరసత్వం పొందాలనే లక్ష్యంతో బ్రిటీష్ మహిళను వివాహం చేసుకొని మోసం చేయాలని ప్రయత్నించిన ఒక పాకిస్తానీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ప్రస్తుతం బ్రిటన్ లోని వలసదారుల నియంత్రణ వ్యవస్థపై చర్చకు దారితీస్తోంది.

పెళ్లి పేరిట పెద్ద కుట్ర

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆ పాకిస్తానీ వ్యక్తి ముందే యూకే పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో బ్రిటీష్ మహిళతో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమ, పెళ్లి పేరిట ఆమెను నమ్మించి వివాహానికి సిద్ధం చేశాడు. నిజానికి తన లక్ష్యం బ్రిటన్ లో శాశ్వత నివాస హక్కు, పౌరసత్వమేనని పోలీసులు వెల్లడించారు..

నకిలీ పత్రాలతో మోసం

వివాహ ప్రక్రియకు సంబంధించి ఆ వ్యక్తి పలు నకిలీ పత్రాలు సమర్పించినట్టు అధికారులు గుర్తించారు. అతడి వీసా స్థితి, గత చరిత్రపై అనుమానాలు రావడంతో అధికారులు లోతైన దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ఇది నకిలీ వివాహమని తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

యువతికి షాక్

ఈ వ్యవహారంతో ఆ బ్రిటీష్ యువతి తీవ్ర మానసిక ఆవేదనకు గురైంది. తాను నిజమైన ప్రేమనేనని నమ్మి పెళ్లికి అంగీకరించానని.. తనను ఇలా మోసం చేస్తారనే అనుమానం కూడా రాలేదని ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.

కఠిన చర్యలు తీసుకుంటాం : పోలీసులు

ఈ ఘటనపై యూకే పోలీసులు తీవ్రంగా స్పందించారు. పౌరసత్వం కోసం నకిలీ వివాహాలు వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ మార్గాల్లో దేశంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తే చట్టం ఎప్పటికీ వదలదని స్పష్టంచేశారు.

వలసదారులపై కఠిన నిఘా

ఇలాంటి ఘటనల నేపథ్యంలో యూకే ప్రభుత్వం వలసదారుల నియంత్రణపై మరింత కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నకిలీ పెళ్లిళ్లు, నకిలీ పత్రాల ద్వారా పౌరసత్వం పొందే ప్రయత్నాలపై ప్రత్యేక నిఘా పెట్టాలనే యూకే హోం ఆఫీస్ నిర్ణయించినట్టు సమాచారం.



Tags:    

Similar News