రాజమండ్రి ఎంపీగారు కనిపిస్తున్నారా.. ?
రాజమండ్రిఎంపీగారు కనిపిస్తున్నారా? అని రాసి ఉన్న ఫ్లెక్సీలు బస్టాండ్లు, కోటిలింగాల రేవు, రైల్వే స్టేషన్, గోదావరి జంక్షన్‌లలో పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి;
రాజమండ్రిలోని కీలక జంక్షన్లలో ఇలాంటి ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. రాజమండ్రిఎంపీగారు కనిపిస్తున్నారా? అని రాసి ఉన్న ఫ్లెక్సీలు బస్టాండ్లు, కోటిలింగాల రేవు, రైల్వే స్టేషన్, గోదావరి జంక్షన్‌లలో పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. దీనికి కారణం.. గత కొన్నాళ్లుగా ఇక్కడ పరిస్థితులు కొంత గాడితప్పాయి. ఆయా వివాదాలపై స్పందించాల్సిన ఎంపీ పురందేశ్వరి ఇప్పటి వరకు పన్నెత్తు మాట మాట్లాడలేదు. కనీసం. ఒక ప్రకటన కూడా జారీ చేయలేదు.
రాజమండ్రిలో వైసీపీ నేతలు గత వారం పది రోజులుగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాలకల్తీ వ్యవ హారంపై విచారణ చేయించాలని.. మాజీ ఎంపీ మార్గాని భరత్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉద్య మిస్తున్నారు. రొజుకొక జంక్షన్‌లో ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో సెగ పెరుగుతోంది. మరోవైపు.. టీడీపీ నాయకులు కూడా పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇక బీజేపీ నేతలు ఏమైనా టార్గెట్ చేస్తారా? అంటే అది కూడా కనిపించడం లేదు.
ఈ పరిణామాలతో ఎంపీని టార్గెట్ చేసుకుని.. ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది . అంతేకాదు.. ఎంపీకి వ్యతిరేకంగా కూడా రాజకీయాలు చేస్తున్నారు. గత కొన్నళ్ల కిందట కల్తీ పాల వ్యవహా రం కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు. మరో నలుగురు ఆసుప త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఎంపీగా ఉన్న పురందేశ్వరి కనీసం.. ఈ వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం.. ఇప్పుడు వివాదానికి దారితీసింది.
గతంలో తరచుగా నియోజకవర్గంలో పర్యటించిన పురందేశ్వరి.. ఇటీవల కాలంలో అసలు నియోజకవర్గం లో అడుగు కూడా పెట్టలేదు. అంతేకాదు.. ఈ ఘటనను లైట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వైసీపీకి ఇది ఒక అవకాశంగా మారిందని అంటున్నారు పరిశీలకులు. కాగా.. ఫ్లెక్సీలపై బీజేపీలోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఫ్లెక్సీలను తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఒకరిద్దరు నాయకులు వ్యాఖ్యానించడం గమనా ర్హం. మొత్తంగా.. ఎంపీ పురందేశ్వరి ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతారో.. అసలు పట్టనట్టే ఉంటారో చూడాలి.