పవన్ హోం మంత్రి అయితేనా ?

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన ఏపీలో కూటమి ప్రభుత్వంలో 21 అసెంబ్లీ సీట్లతో రెండవ అతి పెద్ద పార్టీగా ఉంది.

Update: 2026-06-29 18:04 GMT

పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనసేన ఏపీలో కూటమి ప్రభుత్వంలో 21 అసెంబ్లీ సీట్లతో రెండవ అతి పెద్ద పార్టీగా ఉంది. దాంతో ఉప ముఖ్యమంత్రిగా పవన్ ప్రస్తుతం కొనసగుతున్నారు. 2024 జూన్ 12న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయన బాబు తరువాత ప్రమాణం చేశారు. అలాగే సీఎం తరువాత డిప్యూటీ సీఎం గా ఆయనకు గౌరవం దక్కుతోంది. అయితే పవన్ ఏ శాఖలు తీసుకుంటారు అని ఆనాడే పెద్ద చర్చ సాగింది. కానీ శాఖల కేటాయింపు తరువాత ఆయనకు కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివి దక్కాయి. ఇవన్నీ ఎంతో కీలకమైనవి. ఏపీలో ఈ రోజుకీ డెబ్బై శాతం దాకా గ్రామీణ ప్రాంతం ఉంది. పవన్ కూడా ఎపుడూ పల్లె ప్రాంతాల అభివృద్ధినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. దాంతో ఆయన ఈ శాఖలను ఏరి కోరి ఎంచుకున్నారు అని ప్రచారం సాగింది.

పవన్ కీలక వ్యాఖ్యలు :

ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన నాలుగు నెలల తరువాత పవన్ నేనే హోం మంత్రిని అయితేనా అంటూ పిఠాపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ మీద ఆనాడు ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. ఇక ఆ తరువాత తాజాగా చూస్తే ఆయన కాకినాడలో మా ఊరూ మాటా మంతి కార్యక్రమంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరస్థుల అదృష్టం కొద్దీ తన చేతిలో హోం శాఖ లేదని అన్నారు. దీంతో పవన్ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యానించారు అన్న చర్చ మొదలైంది. ఆయనకు ఈ శాఖ మీద ఫోకస్ ఉందా అని కూడా అంతా ఆలోచించే నేపథ్యం కూడా ఏర్పడింది.

ఊరకే అనరు కదా :

ఇక లేటెస్ట్ గా చూస్తే ఏపీ ఉప సభాపతి రఘురామ క్రిష్ణం రాజు అయితే పవన్ హోం మంత్రి కావచ్చేమో అని ఒక కొత్త చర్చను లేవదీశారు. ఆయన ఊరకే అనరు కదా అని కూడా తన మాటలను పొడిగించారు. పవన్ ఇటీవల మాట్లాడుతూ నేనే హోం మంత్రిని అయితే క్రిమినల్స్ ని స్పేర్ చేయను అని చేసిన కామెంట్స్ ని రఘురామ ఉటంకిస్తూ ఏమో కాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు హోం శాఖ దక్కనుందేమో అని అన్నారు. పవన్ ఏపీలో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు అని గుర్తు చేశారు. అంతే కాదు ఆయన పార్టీ జనసేన కూటమి ప్రభుత్వంలో రెండవ పెద్ద పార్టీగా ఉందని అన్నారు. అందువల్ల పవన్ కోరుకుంటే హోం మంత్రి కావడం చాలా సులువు అన్నట్లుగా రాజు గారు మాట్లాడారు.

నిజంగానే జరిగేనా :

పవన్ గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ అంటూ ఎంతో బరువైన శాఖలను చూస్తున్నారు. మరి ఆయన హోం శాఖ వంటి మరింత టఫ్ శాఖను ఎంచుకుంటారా అన్న చర్చ వస్తోంది. హోం శాఖ అంటేనే డైలీ ఫుల్ ఫోకస్ పెట్టాల్సిన డిపార్ట్మెంట్ అని అంటున్నారు. అయితే పవన్ లాంటి పవర్ ఫుల్ లీడర్ ఈ శాఖ తీసుకుంటే జరిగేదే వేరు అన్న వారూ ఉన్నారు. నిజానికి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా ప్రధమ కర్త్వవ్యం. దాంతో హోం శాఖ ఆ విధంగా చూస్తే ఎంతో ముఖ్యమైనది. పైగా కూటమిలో ముఖ్య నేత అయిన పవన్ కి ఈ శాఖ ఇవ్వాలని జనాల నుంచి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. కానీ పవన్ మనసులో ఏముందో అన్నదే చూడాలని అంటున్నారు. మరి రఘురామ చెప్పినట్లుగా ఏమో పవన్ హోం మంత్రి కావచ్చేమో అన్నది ఇపుడు వైరల్ అవుతోంది. పవన్ హోం మంత్రి అయితే మాత్రం ఏపీలో చాలా మార్పులే చూడాల్సి వస్తుందని విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News