అంతా మోడీ మదిలోనే !
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది. ఫలానా డేట్ అని ప్రచారం బయటకు జరుగుతున్నా కూడా అసలైన తేదీ ఏమిటి అన్నది మోడీ అమిత్ షాలకు మాత్రమే తెలుసు అని అంటున్నారు.
కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం సమీపిస్తోంది. ఫలానా డేట్ అని ప్రచారం బయటకు జరుగుతున్నా కూడా అసలైన తేదీ ఏమిటి అన్నది మోడీ అమిత్ షాలకు మాత్రమే తెలుసు అని అంటున్నారు. అలాగే ఎవరు ఉంటారు, ఎవరు బయటకు వెళ్తారు అన్నది కూడా ఈ ఇద్దరు కేంద్ర పెద్దలకే ఎరుక అని అంటున్నారు. కేంద్ర మంత్రి వర్గం మీద అనేక రకాలైన ఊహాగానాలు వస్తున్నప్పటికీ అసలు తెర వెనక పేరు ఏమిటి అన్నది వారిద్దరికి మాత్రమే తెలుసు అని అంటున్నారు. ఈసారి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ అన్నది చాలా కీలకంగానే ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి మొత్తం రెండేళ్ళ పనితీరుని స్కానింగ్ చేసిన మీదటనే కేంద్ర మంత్రుల మీద ప్రభుత్వ పెద్దల ఆలోచనలు చర్యలు ఉంటాయని అంటున్నారు.
యువతకు పెద్ద పీట :
ఇక కేంద్ర మంత్రులుగా యువతకే పెద్ద పీట వేయాలని నిర్ణయించారని అంటున్నారు. యాభై ఏళ్ళు దాటిన వారిని తక్కువ మందిని తీసుకుని ఈ లోపు వారికే ఎక్కువ శాతం కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని ఒక ఫార్ములాను రూపొందించారని అంటున్నారు. అదే విధంగా సీనియర్ నేతల విషయం వారి భవిష్యత్తు మీద కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కొంత మందిని గవర్నర్లుగా పంపించాలని చూస్తున్నారు. మరి కొంత మందిని పార్టీ సేవకు వాడుకోవాలని కూడా తలపొస్తున్నారు అని అంటున్నారు. ఇంకొంతమంది సేవలను కేవలం సలహా సంప్రదింపులకు మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి.
వీరికి అగ్ర తాంబూలం :
బీజేపీ కోసం తమ సొంత పార్టీలను ధిక్కరించి వచ్చి ప్రత్యేక వర్గంగా ఏర్పాటు చేసుకుని ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అలాగే ఉద్ధవ్ థాక్రే శివసేనలకు చెందిన ఎంపీలకు మంత్రి వర్గ విస్తరణలో అగ్ర తాంబూలం ఉంటుందని అంటున్నారు. 20 మంది దాకా ఎంపీలు ప్రత్యేకవర్గంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఏర్పడ్డారు. దాంతో వారికి కనీసంగా మూడు నుంచి నాలుగు మంత్రి పదవులు ఇస్తారు అని ప్రచారం సాగుతోంది. అదే విధంగా ఉద్ధవ్ థాక్రే శివసేన నుంచి ఆరుగురు విడిపోయి బయటకు వచ్చారు. వీరిలో ఒకర్కి కేంద్ర మంత్రి పదవి ఖాయమని మరొకరికి సహాయ మంత్రి ఇస్తారని అంటున్నారు. అలాగే ఆప్ నుంచి ఏడుగురు ఎంపీలు రాజ్యసభలో విడిపోయి కూటమికి మద్దతుగా నిలిచారు. అందులో కూడా ఒకరిద్దరికి చాన్స్ తప్పనిసరిగా ఉంటుందని చెబుతున్నారు.
కొత్త నెత్తురు కోసమే :
ఈసారి మంత్రి వర్గం కూర్పు అంతా యూత్ కి కొత్త వారికే అని అంటున్నారు. అలా కొత్త రక్తాన్ని మంత్రి వర్గంలో నింపడం ద్వారా ఫ్రెష్ లుక్ ని తీసుకుని రావాలని భావిస్తున్నారు. దేశంలో జెన్ జీ తరం జోరు చేస్తోంది. వారి పల్స్ ని పట్టుకోవడం అన్నది ఏ రాజకీయ పార్టీకి అయిన అత్యవసరం. అందుకే యువతకు పెద్ద పీట వేస్తే వారు ఈజీగా కనెక్ట్ అవుతారు అని అంటున్నారు. అలాగే జెన్ జీ తరం ప్రభుత్వం వైపు చూస్తే చూపు కానీ చేసే ఆలోచనలో కానీ మార్పు ఉంటుందని అది 2029 ఎన్నికల నాటికి బీజేపీకి ఎన్డీయేకి బాగా ఉపయోగపడుతుందని కూడా లెక్క వేస్తున్నారు. దాంతో ఈసారి యూత్ కేబినెట్ గానే పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.