దారుణం : తల్లీకూతుళ్లని అత్యాచారం చేసి , బ్లాక్ మెయిల్ చేస్తున్న తండ్రి ఫ్రెండ్!

Update: 2020-09-13 17:30 GMT
ఈ సమాజంలో ఎన్ని మార్పులు జరిగినా కూడా ఆడవారి పై జరిగే అఘాయిత్యాలకు మాత్రం చరమగీతం పాడలేకపోతున్నాం. నిత్యం దేశంలో ఎంతోమంది అమాయకమైన మహిళలు కామాంధుల చేతుల్లో నలిగిపోతున్నారు. నిర్భయ వంటి కఠిన చట్టాలు చేసినా, కామాంధులక  ఉరిశిక్షలు విధిస్తున్నా కనీస భయం కలగకపోగా అంతకంతకూ రెచ్చిపోతున్నారు. అసలు మనమెందుకు తగ్గాలి అనుకుంటూ ఆడవారిపై అఘాయిత్యాలకు దిగుతున్నారు. తల్లీకూతుళ్లని తండ్రి స్నేహితుడు రేప్ చేసిన ఓ దుర్ఘటన  ఘటన తాజాగా వెలుగుచూసింది. అత్యాచారం చేస్తూ వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ కి  దిగి పశువాంఛలు తీర్చుకుంటున్న పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌ లో జరిగింది.

గురుగ్రామ్‌ కి చెందిన మహిళ తన భర్త, కుమార్తెతో కలసి నివాసముంటోంది. భర్త స్నేహితుడు అషు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఆ సమయంలోనే ఫ్రెండ్ భార్యపై కన్నేసిన అషు నీచానికి ఒడిగట్టాడు. స్నేహితుడి భార్య ఆరోగ్యం బాలేదని చెప్పడం తో ఔషధం పేరుతో ఆమెకి మత్తు మందు కలిపిన పానీయం ఇచ్చాడు. అది, తాగి ఆమె స్పృహ‌ కోల్పోగానే తనలోని కామ కోరికని తీర్చుకున్నాడు. రేప్ చేస్తూ వీడియోలు తీసి బ్లాక్ ‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తరువాత, బాధితురాలి భర్తకి గుండెపోటు రావడంతో రోహ్‌ తక్‌ లోని ఆస్పత్రిలో చేర్పించారు. తన మైనర్ కూతురిని తాతయ్య, నానమ్మలతో వదిలి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆ సమయంలో స్నేహితుడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు వచ్చినట్టుగా కీచకుడు అషు వారి ఇంటికెళ్లాడు.

ఆమె కూతురికి మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మత్తుమందిచ్చి అమానుషంగా రేప్ చేశాడు. కూతురి అత్యాచార వీడియో కూడా తీసి ఇద్దరినీ బ్లాక్ ‌మెయిల్ చేసేవాడు. ఇంతలో గత జూన్ ‌లో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ మానవ మృగాన్ని తలచుకుని బాధితురాలు, ఆమె కుమార్తె భయపడిపోయారు. అషుకి నేరచరిత్ర కూడా ఉండడంతో హడలిపోయారు. సరిగ్గా నెల రోజుల అనంతరం జూలైలో కీచకుడు అషు అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో అరెస్టై జైలుకి వెళ్లాడు.   ఆ విషయం తెలిసిన బాధితురాలు, ఆమె కుమార్తె ధైర్యం కూడగట్టుకుని రెండు రోజుల కిందట పోలీసులను ఆశ్రయించారు. రేప్ చేసి.. ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు.దీనితో ఇప్పటికే జైలులో ఉన్న అషుపై అత్యాచారం, పోక్స్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Tags:    

Similar News