రద్దు, క్షమాపణలు అంతా మోసమేనా ?
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చట్టాల కారణంగా ఇబ్బందులు పడిన రైతాంగానికి క్షమాపణలు చెప్పారు. దాంతో చట్టాల రద్దు, క్షమాపణలంతా నిజమే అనుకున్నారు. అయితే అదంతా కేవలం నాటకాలేనని తేలిపోయింది. వ్యవసాయశాఖ మంత్ర నరేంద్రసింగ్ తోమర్ మహారాష్ట్ర పర్యటనలో మాట్లాడుతు తొందరలోనే వ్యవసాయ చట్టాలను మళ్ళీ కొత్తరూపంలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
తోమర్ చేసిన ప్రకటనతో రైతుసంఘాలన్నీ ముందు ఆశ్చర్యపోయి తర్వాత మండిపోతున్నాయి. నిజానికి వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోడి చేసిన ప్రకటనను చాలామంది ముందు నమ్మలేదు. అయితే ఆ తర్వాత రైంతాంగానికి క్షమాపణలు కూడా చెప్పటంతో ఏమోలే మోడీ మనసు మారిందేమో అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే 29 అసెంబ్లీలు, మూడు లోక్ సభలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బతగిలింది.
పైగా తొందరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో మోడీ వెనక్కు తగ్గారనే అందరు అనుకున్నారు. అయితే తోమర్ తాజా ప్రకటనతో అందరి అనుకున్నట్లు మోడీ పూర్తిగా వెనక్కు తగ్గలేదని అర్ధమైపోయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మొదలుకాకుండానే వ్యవసాయ చట్టాలపై తోమర్ ఎందుకు ప్రకటన చేశారనే విషయమే ఎవరికీ అర్దంకావటంలేదు. తోమర్ చేసిన ప్రకటనతో బీజేపీకి పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఇబ్బందులు పెరుగుతాయన్న విషయం తెలీకుండానే ఉంటుందా ?
తోమర్ కూడా ఏదో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికాదు. చాలా సీనియర్ నేతనే చెప్పాలి. రాజకీయాలను బాగా ఔపోసన పెట్టిన వ్యక్తే తోమర్. అలాంటి నేత చేసిన తాజా ప్రకటనను విన్న తర్వాత మోడీ మనసులో ఉన్నదాన్నే కేంద్రమంత్రి బయటకు చెప్పేసినట్లుగా భావించాలి. ఏదేమైనా వ్యవసాయ చట్టాల రద్దు, క్షమాపణలు చెప్పటమంతా అబద్ధం, మోసమనే రైతుసంఘాలు మండిపడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.