• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ యాత్రకు రథం సిద్ధం.....

పవన్ యాత్రకు రథం సిద్ధం.. వైరల్ ఫొటో

By - Tupaki Desk
Update: 2022-12-07 11:56 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రకు రంగం సిద్ధమైంది. ఎన్నికలకు ముందు నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.ఇప్పటికే బస్సు యాత్రను ప్రకటించిన పవన్ అన్నట్టుగానే తన బస్సును రెడీ చేశారు.  ఈ బస్సు అచ్చం నాడు రాజకీయాల్లోకి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ యాత్రలో ఉపయోగించిన బస్సులాగానే ఉండడం విశేషం.

పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఇకనుంచి పార్టీ పటిష్టత కోసం జనంలోకి వెళ్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచిస్తారని అంటున్నారు.

పవన్ కల్యాణ్  యాత్ర కోసం బస్సు సిద్ధమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఆ బస్సును పరిశీలిస్తూ దానితో ఫొటోలు దిగి రెడీ అయిన ఆ వాహనాన్ని చూపించారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేసిన బస్సు ఫొటోలు వైరల్ అయ్యాయి.

 బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. బస్సు యాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వినే అవకాశం ఉన్నందున ఈ యాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక గణనీయమైన ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి ఓడారు. ఆయన పార్టీ ఒకే సీటును గెల్చుకుంది. కానీ ఈసారి అలా కాకుండా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ పట్టుదలగా ఉన్నారు. అందుకు అవసరమైన సమీకరణాలను ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా కాపునేతలతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెరమీదకు తెచ్చే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ లకు రెండు సామాజిక వర్గాలు అండగా నిలిచే అవకాశం ఉన్నందున ఇప్పుడు జనసేన కూడా ఆ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత  ఇచ్చే అవకాశం ఉంది.

బస్సు యాత్రలో ప్రతినియోజకవర్గంలో పర్యటించి అక్కడ జనసేన బలోపేతం చేసి నియోజకవర్గ ఇన్ చార్జీలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సు రెడీ కావడంతో ఇక యాత్రకు రూట్ మ్యాప్ మాత్రమే మిగిలి ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • JanasenaPartyChief 
  • PawanKalyan 
  • APPolitics 
  • PawanBusYatra 
  • YSRCPGovernment 
  • PawanBusYatraChariot 
  • APAssemblyElections 
  • TDPParty 
  • YSRCPParty 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS