ఈ కష్టం.. అలీకి కూడా వచ్చిందా?
ఎట్టకేలకు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత ఆ పార్టీ కోసం గత ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగిన సినీ నటులకు పదవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ హాస్య నటుడు అలీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళిలకు పదవులు దక్కాయి. పోసానికి ఏపీ చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా అవకాశం దక్కింది.
ఇక అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవి దక్కింది. పోసానితో పోలిస్తే అలీ పదవి అంత చెప్పుకోదగినదేమీ కాదని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. వాస్తవానికి అలీకి రాజ్యసభ సీటు లభిస్తుందని ప్రచారం జరిగింది. లేదా ఎమ్మెల్సీ ఖాయమనే అంచనాలు వెలువడ్డాయి. ఇక చివరకు ఏపీ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అవేమీ నిజం కాలేదు.
ఇక చివరకు ప్రస్తుత ప్రభుత్వానికి ఇక ఏడాదిన్నర అధికారం మాత్రమే ఉన్న దశలో.. మరోమారు సినీ నటుల అవసరం వచ్చే ఎన్నికల్లో తప్పదని తెలిశాక మాత్రమే అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని కేటాయించారని గాసిప్స్ వినిపించాయి.
అలీ కూడా ఏదో ఒక పదవి అన్నట్టులే సర్దుకుపోయారు. అలీ స్థాయికి అది పెద్ద పదవి కాకపోయినా జీతభత్యాలు రూపంలో నెలకు రూ.3 లక్షలు, సెక్యూరిటీ, పీఏ, వసతికి ఖర్చులు ఇలా నెలకు అన్ని రూపాల్లో రూ.5-6 లక్షల వరకు ముడుతుండటంతో అలీ కూడా సంతోషంగానే కనిపించారు.
అయితే ఆయన బాధ్యతలు చేపట్టాక ఇంతవరకు అలీకి చాంబర్ ను కానీ కార్యాలయాన్ని కానీ ఏర్పాటు చేయలేదని అంటున్నారు. అలీ బాధ్యతలు స్వీకరించినప్పుడు సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్ రెడ్డి చాంబర్ లో కూర్చుని బాధ్యతలు చేపట్టారు. అయితే ఇంతవరకు ఆయనకు చాంబర్ కేటాయించలేదని టాక్ నడుస్తోంది.
అలాగే ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించింది. అయితే వీరికి కూడా కూర్చోవడానికి కుర్చీలు లేవని గతంలోనే ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితుడైన అలీకి కూడా ఇలాంటి పరిస్థితే ఉందని చెవులు కొరుక్కుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.