ఇంటి నుంచే పని.. ఉద్యోగులు ఏమంటున్నారు?

Update: 2020-09-23 12:10 GMT
కరోనా దెబ్బకు ఆఫీసులన్నీ మూతపడ్డాయి. ఇప్పుడంతా వర్క్ ఫ్రం హోం. ఇంట్లో భార్యాపిల్లలతో కలిసి పనిచేయడం మొదట్లో కొంచెం కొత్తగా అనిపించినా.. ఆ తర్వాత ఇంట్లోంచి పనిచేయడం కత్తిమీద సాములా మారింది. పని వాతావరణం లేకపోవడం..  ఇంట్లోని భార్యపిల్లల ఒత్తిడి.. ఆఫీస్ ఒత్తిడి.. రెస్ట్ లేని టైమింగ్ తో ఇంటినుంచి పనిని అందరూ వ్యతిరేకిస్తున్నారు.

ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ అంతా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. హైదరాబాద్ లో ఐటీ, ఐటీఈఎస్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల మనోగతం అని హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజేస్ అసోసియేషన్ (హైసియా) అధ్యయనంలో తేలింది.

95శాతం కంపెనీలు వర్క్ ఫ్రం విధానంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 90-100శాతం ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు నెలలుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య  పెరిగింది.

ఉద్యోగుల ఉత్పాదకత 75శాతం ఉన్నట్టు 80శాతం కంపెనీలు తెలిపాయి. పెద్ద కంపెనీల్లో ఇది 90శాతంగా ఉంది. బ్రాడ్ బ్యాండ్, విద్యుత్ కోతలు, ఇంట్లో నెలకొన్న వాతావరణం ఉద్యోగులకు అడ్డంకిగా మారాయి. ఉద్యోగుల్లో ధైర్యం తగ్గిందని 34శాతం మంది తెలిపారు. సుమారు 70శాతం పెద్ద కంపెనీలు గత 6 నెలల్లో ప్రెషర్లను నియమించాయి. కొన్ని కంపెనీలు 1000మంది వరకు రిక్రూట్ చేసుకున్నాయని తెలిసింది.
Tags:    

Similar News