• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జేసీలపై ఈడీ దాడులకు కారణం...

జేసీలపై ఈడీ దాడులకు కారణం ఇదేనా?

By - Tupaki Desk
Update: 2022-06-18 11:30 GMT
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ సోదరుల ఇళ్ళు, ఆఫీసులపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉన్నతాధికారులు దాడులు చేయటం సంచలనంగా మారింది. తాడిపత్రి, అనంతపురంతో పాటు హైదరాబాద్ లోని ఇళ్ళు, ఆఫీసులపై ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు చేశారు. మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి, మాజీ ఎంఎల్ఏ, ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న జేసీ ప్రభాకరరెడ్డి ఇళ్ళపైన ఈడీ దాడులు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

జేసీల ఇళ్ళపై దాడులు జరగటానికి రెండు కారణాలు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. మొదటిదేమో వీళ్ళ కంపెనీ లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేసుకున్నదని గతంలోనే నిరూపణైంది. దానికి సంబంధించిన ఆరోపణలపైనే  ఇపుడు ఈడీ దాడులు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇక రెండో కారణం మాత్రం రాజకీయపరమైనదే.  రాజకీయంగా మాజీ ఎంపీ ఇపుడు పెద్దగా క్రియాశీలకంగా లేరన్నది వాస్తవం.

ఇదే సమయంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి మాత్రం యాక్టివ్ గా ఉన్నారు. వీళ్ళిద్దరు టీడీపీకి రాజీనామా చేసి తొందరలోనే బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది.

గతంలో వీళ్ళు కూడా ఇలాంటి కలరింగే ఇచ్చారు కానీ కమలం పార్టీలో చేరలేదు. ఈ నేపధ్యంలోనే జేసీ సోదరులను తన దారికి తెచ్చుకునేందుకు కేంద్రం వీళ్ళపై ఈడీని ప్రయోగించిందనే చర్చ పెరిగిపోతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా నేతలను తన దారికి తెచ్చుకునేందుకు బీజేపీ ఇదే పనిచేయిస్తోందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే.

2019 ఎన్నికల వరకు టీడీపీలో యాక్టివ్ గా ఉన్న ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళపై సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు దాడులు చేశారో లెక్కేలేదు. ఈరోజో రేపో అరెస్టు తప్పదన్నంతగా బిల్డప్ ఇచ్చారు.

తీరా ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వీళ్ళు బీజేపీలో చేరిపోయారు. అంతే గడచిన మూడేళ్ళుగా వీళ్ళపై ఒక్కటంటే ఒక్క దాడి కూడా జరగలేదు. జరిగినవి చూసిన తర్వాత తాజా ఈడీ దాడులు జేపీలను లొంగదీసుకోవటంలో భాగమనే ప్రచారానికి మద్దతు పెరుగుతోంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి
Tags:    
  • JCBrothers 
  • EnforceDepartment 
  • Anantapuram 
  • FormerMPJCPrabhakarReddy 
  • FormerMLA 
  • TadipatriMuncipalChairman 
  • JCPrabhakarReddy 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS