బ్రేకింగ్: తెలంగాణలో భూకంపం

Update: 2021-10-23 09:45 GMT
దక్షిణ భారతదేశంలోనే ఒక గట్టి పీఠభూమిగా ఉన్న తెలంగాణ ప్రాంతంలో భూకంపాలు వచ్చే తీవ్రత చాలా తక్కువ అని ఎన్నో పరిశోధనల్లో తేలింది. అయితే తాజాగా వాటిని పటాపంచలు చేస్తూ భూమి కంపించింది. ఉత్తర తెలంగాణలోని పలు చోట్ల భూమి కంపించింది. శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.

మధ్యాహ్నం 2.03 గంటల ప్రాంతంలో భూమి కంపించడంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలు, రామంగుండంలలో భూప్రకంపనలు సంభవించాయి. రామగుండం, పెద్దపల్లిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో భయపడిన జనం బయటకు పరుగులు తీశారు. సీతారాంపల్లెలోను స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.

భూకంప లేఖినిపై దీని తీవ్రత 4 గా నమోదైంది. కరీంనగర్ కు ఈశాన్యంగా 45 కి.మీల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మంచిర్యాల జిల్లాలోనూ పలు చోట్ల ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలలోని రాంనగర్, గోసేవ మండల్ కాలనీ, నస్పూర్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.ఇళ్లలోంచి పరుగులు తీశారు.

భూ భూవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం.. తెలంగాణ విదర్భ ప్రాంతమంతా ఒక దక్కన్ పీఠభూమిగా ఉంది. హైదరాబాద్ అత్యంత సేఫ్ సిటీగా ఇప్పటికే పేర్కొన్నారు. అయితే తాజాగా ప్రకంపనలతో ఆ మాట తప్పు అని రుజువైంది. మరి ఈ ప్రకటపనలు ఆగుతాయా? లేవా? అన్నవి చూడాలి.




Tags:    

Similar News