ఎమ్మెల్యేలు ఏపీ సీఎం అపాయింట్ మెంట్ ఎందుకు అడగడం లేదో తెలుసా?

Update: 2020-08-28 12:30 GMT
వైసీపీ ప్రభుత్వం వచ్చినా.. మాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం  లేదు అని ఇన్నాళ్లు బాధపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ మీడియాకు లీకులు ఇచ్చి ఇదే విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. తీరా సీఎం జగన్ ఈ మధ్య ఎమ్మెల్యేలను కలవడానికి ప్రణాళిక రూపొందించగా.. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా కలవడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదంట..

ఎందుకని కొందరు ఎమ్మెల్యేలు, వారి పీఏలను ఆరాతీయగా.. ‘ఏదో విధంగా సీఎం అపాయింట్ మెంట్ తీసుకొని సీఎం గారి దగ్గరికి వెళ్తే మా చిట్టా మేము చేసే అన్ని పనులు సీఎం గారి దగ్గర ఉన్నాయని.. బండారం బయటపడిపోతోంది’ అని చెబుతున్నారట..  ప్రజాధనం ఎలా వృథా చేస్తున్నాం.. నియోజకవర్గంలో ఏం చేసింది? అవినీతి మీద కూడా ఎమ్మెల్యేల చిట్టా సీఎం గారి దగ్గర ఉందంట..  ఇవన్నీ అడుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు నీళ్లు నమిలే పరిస్థితి ఉందని.. పోయి వచ్చిన ఎమ్మెల్యేలు  వేరే ఎమ్మెల్యేలకు చెప్తూ వాపోతున్నారట..

సీఎం దగ్గరికి వెళ్లి నెగెటివ్ తెచ్చుకోవడం ఎందుకని వైసీపీ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు అపాయింట్ మెంట్ లే అడగడం లేదట.. ఈ మధ్య పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు.. భూముల విషయంలో  ఎమ్మెల్యేల మీద పెద్ద ఎత్తున అవినీతి మరకలు వచ్చాయి కాబట్టి ప్రస్తుతం సీఎం దగ్గరికి వెళ్లక పోవడం మంచిందని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట.. ఇప్పుడు ఇదే వైసీపీ ఎమ్మెల్యేల్లో హాట్ టాపిక్ గా మారిందని ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News