• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 9 బుధవారం 2019...

జనవరి 9 బుధవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-09 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: మీ ఆశయాలు నెరవేరుతాయి. రాబడి సంతృప్తికరం. వ్యాపారాల్లో వృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, పారిశ్రామికవర్గాల వారికి అరుదైన అవకాశాలు. ఐటీ నిపుణులకు అనుకూల పరిస్థితులున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు తొలగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కార్యసిద్ధి. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. శ్రమకు ఫలితం దక్కదు. కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు ఊరట. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు అవకాశాలు చేజారవచ్చు. మహిళలకు సోదరులతో కలహాలు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

మిథున రాశి: ఆలోచనలు కలిసిరావు. రాబడికి మించి ఖర్చులు. కాంట్రాక్టుల కోసం మరింత శ్రమిస్తారు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాల్లో వ్యయప్రయాసలు. కళాకారులు, రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులు పరిశోధనల్లో వెనుకబడిపోతారు. మహిళలకు మానసిక అశాంతి. లక్ష్మీనృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సన్నిహితులు సాయంతో పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులు, రాజకీయ రంగాల వారికి సన్మానాలు. వ్యాపారాల్లో లాభాలు దక్కుతాయి. ఐటీ నిపుణుల్లో కొత్త అవకాశాలు. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. శివాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థాయి దక్కుతుంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటారు. భూములు, గృహాలు కొనుగోలు చేస్తారు. పారిశ్రామిక, రాజకీయరంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ ఉద్యోగులకు అనుకోని ఆహ్వానాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

కన్యారాశి: ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. శ్రమకు తగిన ఫలితం దక్కదు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చిక్కులు. ఉద్యోగులకు స్థానమార్పు. కళాకారులు, రాజకీయరంగాల వారికి నిరాశ తప్పదు. వ్యాపారాల్లో ఆటుపోట్లు  ఎదురవుతాయి. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితులు. విద్యార్థులు మరింత కష్టపడాలి. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

తులారాశి: రాబడి నిరుత్సాహపరుస్తుంది.  కొత్త నిర్ణయాల్లో తొందరపడద్దు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు చికాకులు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. మహిళలకు కొన్ని సమస్యలు ఇబ్బందులు పెడుతాయి. వినాయకుడి స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయం సంతృప్తికరం. సన్నిహితులతో చర్చలు జరుపుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కృషి ఫలిస్తుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. ఐటీ ఉద్యోగులకు అరుదైన ఆహ్వానాలు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం కలుగుతుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆత్మీయుల నుంచి ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. బంధువులు, స్నేహితులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. ఉద్యోగులకు విధుల్లో ఇబ్బందులు. పారిశ్రామిక, కళారంగాల వారికి అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక ఆందోళన. శివపంచాక్షరి పఠించడం మంచిది.
 
మకర రాశి:  ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు దక్కుతాయి. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీయానం. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలున్నాయి. గణేశాష్టకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు. ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఐటీ నిపుణల యత్నాలు ఫలించవు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు మానసిక అశాంతి. కనకదుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో ఊహించని అభివృద్ధి. ఐటీ నిపుణులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలున్నాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.


Full View

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS