• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 30 ఆదివారం 2018...

డిసెంబరు 30 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-30 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల సహాయంతో ముందడుగు వేస్తారు. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగవర్గాలకు ఊహించని రీతిలో ఇంక్రిమెంట్లు. రాజకీయ, వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. సినీ - టీవీ కళాకారులకు మంచి ప్రోత్సాహం. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలకు ఆస్తి లాభం. గణపతిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి గందరగోళం. నిరుద్యోగులకు కొంత అనుకూల వాతావరణం. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు అవకాశాలు చేజారతాయి. సీనీ కళాకారులకు మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరం. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు నిలిచిపోయే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. సీని కళాకారులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు ఫలితాలపై నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి: పలుకుబడి పెరుగుతుంది. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. వ్యాపారాలు లాభాలు దిశగా సాగుతాయి. పారిశ్రామిక - రాజకీయ రంగాల వారికి ఆశాజనకం. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు. సీని కళాకారులకు అవార్డులు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం. వేంకటేశ్వరస్వామిని పూజించం మంచిది.

సింహ రాశి:  ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. రుణ ఒత్తిడులు ఎదురవుతాయి. పారిశ్రామిక - వైద్యరంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. సీని కళాకారులకు సమస్యలు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కన్యారాశి: ఆర్థిక విషయాల్లో చికాకులు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు పదవీయోగం. సీని కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో సంతోషంగా ఉంటారు. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

తులారాశి: అంచనాలు తారుమారవుతాయి. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. ఉద్యోగులకు అదనపు భారం. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి ఒత్తిడులు. సీని కళాకారులకు అనుకూల సమయం కాదు. విద్యార్థులకు నిరాశాజనకం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వస్తు, వస్త్ర లాభాలు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. విద్యార్థులకు పరిశోధనల్లో అనుకూలతలు. మహిళలకు ఆస్తి లాభం. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: కొత్త కాంట్రాక్టులు చేజిక్కుంటారు. విలువైన వస్తువులు కొంటారు. యత్న కార్యసిద్ధి. ఆర్థిక విషయాలు మెరుగవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాల్లో  నూతన పెట్టుబడులు అందుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు. ఉద్యోగులకు పదోన్నతులు. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మకర రాశి: కొన్ని విషయాలు నిరాశ పరుస్తాయి. ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. భాగస్వామ్య వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగవర్గాలకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి విమర్శలు ఎదురవుతాయి. సీని కళాకారులకు గందగోళంగా ఉంటుంది. విద్యార్థులకు నిరాశ. మహిళలకు నిరుత్సాహమే. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కుంభరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు ముందుకు సాగవు. బాధ్యతలతో సతమతమవుతారు. ఉద్యోగులకు చికాకులు తప్పవు. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి నిరాశ తప్పదు. విద్యార్థులకు ఒడిదుడుకులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేయాల్సి వస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక - సాంకేతిక రంగాల వారికి సన్మానాలు. వాహనాలు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సీని కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి. విద్యార్థులకు కొత్త కోర్సులు దక్కుతాయి. సంఘంలో గౌవరం. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. లక్ష్మీదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

Copyright @2026

Powered by Blink CMS