• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 9 ఆదివారం 2018...

డిసెంబరు 9 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-09 01:44 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆస్తి వివాదాలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి విమర్శలు.  ఆదాయం కంటే ఖర్చులు అధికం. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.  సినీ కళాకారులకు మానసిక ఆందోళన. విద్యార్థులకు  నిరాశ. పారిశ్రామిక - రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా. మహిళలకు కుటుంబంలో సమస్యలు. వినాయకుడికి అభిషేకం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆదాయం అంతగా ఉండదు. వ్యూహాలు ఫలించదు. దూర ప్రయాణాలు ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి సమస్యలు వేధిస్తాయి. సినీ కళాకారులకు ప్రయత్నాలు అనుకూలించవు. ఉద్యోగాల్లో శ్రమ తప్పదు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు నిరుత్సాహమే. కనక దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మీ ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. సీనీ కళాకరులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు సన్మానాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కర్కాటక రాశి: విద్యార్థులకు నూతన అవకాశాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు.  ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ - వైద్య రంగాల వారికి సన్మానాలు. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. విద్యార్థులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి. మహిళలకు విశేష గౌరవం. శివాష్టకం పఠించడం మంచిది.

సింహ రాశి: బంధువులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అంచనాలు తారుమారు. విలువైన వస్తువులు జాగ్రత్త. పనుల్లో ప్రతిబంధకాలు. ఉద్యోగులకు చికాకులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. సీనీ రంగంవారికి అవకాశాలు దూరమవుతాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఒడిదుడుకులు. గణపతిని పూజించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. భూవివాదాలు చికాకు పరుస్తాయి. నిర్ణయాల్లో జాప్యం. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. ఉద్యోగాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది. రాజకీయ - సాంకేతిక రంగాల వారికి మానసిక ఒత్తిడులు. సినీ కళాకారుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. దుర్గామాతకు కుంకుమార్చన చేయడం మంచిది.

తులారాశి: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. చర్చలు సఫలమవుతాయి. విలాసవంతంగా గడుపుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. సినీ కళాకారులకు ఆశాజనకం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. రుద్రాభిషేకం చేయించడం మంచిది.

వృశ్చిక రాశి: నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చికాకులు తప్పవు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాపరుస్తాయి. వ్యాపారాలు సామన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు.  పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దు. సినీ కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. మహిళలకు కుటుంబ సమస్యలు. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

ధనస్సు రాశి: బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.  ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు పలుకుబడి పెరుగుతుంది. సినీ కళాకారులకు నూతనోత్సాహం. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మకర రాశి: ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో మాటపట్టింపు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి కృషి ఫలించదు. సినీ కళాకారులకు అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు. కుటుంబ  సభ్యులతో వివాదాలు. మహిళలకు సోదరులతో కలహాలు. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: మిత్రుల నుంచి ధనలాభం. ఉద్యోగులకు పదోన్నతి. నిరుద్యోగులకు అవకాశాలు దక్కుతాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. సినీ కళాకారులకు గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అప్రయత్న కార్యసిద్ధి. వాహనయోగం. మహిళలకు ఆస్తి లాభం. నృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. దూర ప్రాంతాల నుంచి  కీలక సమాచారం అందుతుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు మిత్రులుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి. సినీ కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి అరుదైన పురస్కారాలు. విద్యార్థులకు అవార్డులు. మహిళలకు సోదరులతో సఖ్యత. రాఘవేంద్ర స్వామి సోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS