చైనాలో కరోనా కలవరం... విమానాలు, పాఠశాలలు బంద్... కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్
చైనాలో తిరిగి కరోనా కలవరం మొదలైంది. ఒక్క కేసు నమోదైన ఆ దేశం ఉలిక్కిపడుతోంది. పలు నగారాల్లో వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో అప్రమత్తమైంది. వందల కొద్ది విమానాలు రద్దీ చేశారు. స్కూళ్లు మూసివేశారు. పెద్ద ఎత్తున సామూహిక పరీక్షలకు ఉపక్రమించారు. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ఆంక్షలు విధించారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ దేశ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. మునుపటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలతో భయాందోళన చెందుతున్నారు. చైనాలో ఇప్పుడిప్పుడే సాదారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటన ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇచ్చారు. ఇదే ఇప్పుడు డ్రాగన్ కంట్రిని భయపెడుతోంది. కరోనా వ్యాప్తికి పర్యాటకులే కారణమని చెబుతున్నారు. అందువల్ల ఆంక్షలు విధించారు. గురువారం పర్యాటకులకు భారీగా కరోనా పరీక్షలు నిర్వహించారు. సరిహద్దులను మూసివేశారు.
కరోనా విషయంలో చైనా కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. కొన్ని దేశాల్లో కరోనా వ్యాప్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తాత్కాలిక పరిమితులు విధిస్తున్నాయి. చైనా మాత్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తికి గల కారణాలను అక్కడి అధికారులు ఇలా చెబుతున్నారు. ఓ వృద్ధ దంపతులతో సహా పదుల సంఖ్యలో పర్యాటకులకు కరోనా పాజిటివ్ రావడమే దీనంతటికీ కారణమని చెబుతున్నారు. వీరంతా షాంఘై నుంచి మొదలై గ్జియాన్, గాన్సు ప్రావిన్స్, ఇన్నర్ మంగోలియాలో పర్యటించారని చెబుతున్నారు. పర్యాటకులు రాజధాని బీజింగ్ సహా ఐదు ప్రావిన్స్‌ల్లో పెద్దఎత్తున ప్రజలతో కాంటాక్టు అయినట్లు భావించి చైనా చర్యలు చేపట్టింది. అనుమానం ఉన్న ప్రాంతాల్లో విహార కేంద్రాలు, పర్యాటన ప్రాంతాలను మూసివేశారు. కరోనా వ్యాప్తికి కారణమైన స్థానిక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇన్నర్ మంగోలియాలోని ఎరెన్‌హట్‌కు రాకపోకలను నిలిపివేశారు.
దాదాపు 40 లక్షల జనాభా ఉన్న లాన్‌జూ ప్రావిన్స్‌తో పాటు సమీప ప్రాంతాల ప్రజలు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు అనుమతిస్తున్నారు. గ్జియాన్, లాన్‌జూల్లో 60 శాతం విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. గురువారం 13 మందికి కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఈ 13 మందిలో అధికంగా ఈశాన్య, వాయువ్య ప్రాంతాలకు చెందిన వారే ఉన్నారని అధికారులు గుర్తించారు. చైనాలో పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకురావడంతోనే మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లక్ష్యంతో జీరో_ కొవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంత సరిహద్దులను మూసివేస్తున్నారు. కొవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. వ్యాప్తిని అరికట్టేందుకు లక్షల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. పరీక్షలతో పాటు వ్యాక్సినేషన్ పక్రియలను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 200 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.