• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అర్జునుడితో ఆపుతారా?.....

అర్జునుడితో ఆపుతారా?.. మరిన్ని అవతారాలా?

By - Tupaki Desk
Update: 2016-09-13 05:52 GMT
మాటలు.. చేతలు ఎలా ఉన్నా.. నిత్యం ‘లౌకిక’ మాటలు మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు అలవాటే. మిగిలిన పార్టీల మాదిరి పురాణ పురుషులతో పోల్చుకునే విధానం దాదాపుగా కనిపించదు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ యువరాజు.. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అర్జునుడిగా పోలుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు వివాదంగా మారిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆయన యూపీలో సుదీర్ఘ యాత్ర చేస్తున్నసంగతి తెలిసిందే.

మరికొద్ది నెల్లలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన యూపీ మొత్తాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. మెజార్టీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా తన రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖాట్ భేటీ అంటూ తన సభల్లో మంచాల్ని ఏర్పాటు చేసి రైతులతో ముచ్చట్లు పెట్టాలన్న ప్లాన్ అట్టర్ ప్లాప్ కావటమేకాదు.. కామెడీ షోగా మారిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఆయన్ను అర్జునుడి అవతారంలో ఫ్లెక్సీని తయారు చేయించటం వివాదాస్పదంగా మారింది. అహ్మదాబాద్ కు రానున్నరాహుల్ కు స్వాగతం పలికేందుకు స్థానిక నాయకులు కాసింత అత్యుత్సాహాన్ని ప్రదర్శించి అర్జునుడి రూపంలో ఫ్లెక్సీని తయారు చేయించటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫ్లెక్సీలో బాణం ఎక్కుపెట్టిన అర్జుడిలా చిత్రీకరిస్తూ ఏర్పాటు చేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీ గురించి తమకు తెలీదని యూపీ కాంగ్రెస్ నేతలు చెప్పటం ఆశ్చర్యకరంగా మారింది. ఇలాంటి ఫ్లెక్సీలతో తమ పార్టీపై ఉన్న ‘లౌకిక’ బ్రాండ్ ఎక్కడ మిస్ అవుతుందోనన్న భయాందోళనల్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.  రాహుల్ ను అర్జునుడితో ఆపితే సరే. మరిన్ని అవతారాల్లో ఆయన్ను చూపిస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందంటున్నారు.
Tags:    
  • Congress poster 
  • Rahul Gandhi 
  • Arjun avataar 

Similar News

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS