• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇచ్చిన మాట నిలబెట్టుకున్న...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం ..ఏమిటంటే ?

By - Tupaki Desk
Update: 2019-12-07 05:55 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ..ఏదైనా ఒక మాట అన్నాడు అంటే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. అలాగే ఎవరికైనా ఒక మాట ఇస్తే ..దానికి కట్టుబడే ఉంటారు. అది ఎంత కష్టమైన కూడా వారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు. అలాగే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఎక్కువగా ఆలోచించరు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ని నిలబెట్టుకున్నారు. ఇంతకీ సీఎం కేసీఆర్ ఎవరికీ మాట ఇచ్చారు ? అయన ఎప్పుడు ఏంచేశారు? అనేది చూద్దాం..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు దాదాపు గా 55 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయాలనీ , అలాగే మరికొన్ని డిమాండ్స్ తో సమ్మె లోకి వెళ్లారు. కానీ , సమ్మె  పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడంతో చాలామంది ఆర్టీసీ కార్మికులు ఆత్మ హత్యలకి పాల్పడ్డారు. అలాగే మధ్యలో ఆర్టీసీ కార్మికులకు రెండు సార్లు అవకాశం ఇచ్చిన సమ్మె ని విరమించలేదు. దీనితో ఆర్టీసీ కథ ఇక ముగిసింది. ప్రైవేట్ చేస్తాం అంటూ ప్రకటించడం తో ... కార్మికులు ఆలోచనలో పడి ..ప్రభుత్వం దిగి రాకపోయేసరికి ..సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు.

ఆ తరువాత కూడా వారిని విధుల్లోకి తీసుకోవడానికి సీఎం కేసీఆర్ కొంత సమయం తీసుకోని , ఆ తరువాత ఎటువంటి షరతులు లేకుండా ఉద్యోగులందర్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంతోషం గా తమ, తమ విధుల్లో జాయిన్ అయ్యారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని రక్షించేందుకు వెంటనే రూ. 100 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. అంతే కాదు టికెట్ ధరలు పెంచుకునేందకు కూడా ఆర్టీసీ కి అనుమతిచ్చింది. అలాగే ఆ తరువాత ఆర్టీసీ కార్మికుల తో ప్రగతి భవన్ లో సమావేశం ఏర్పాటు చేసి ..వారితో మాట్లాడిన సమయంలో .. సమ్మె చేసే సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలని ఆదుకుంటాం అని , వారి కుటుంబంలో ఉన్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

అందులో భాగంగా తాజాగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.సమ్మె సమయంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు సంబంధించిన 10 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో చని పోయిన 10 కుటుంబాల్లోని ఒక్కొక్కరి చొప్పున ఉద్యోగం కల్పించారు. ఒకరికి కండక్టర్గా అవకాశం కల్పించగా, నలుగురికి జూనియర్ అసిస్టెంట్‌, ఐదుగురికి పోలీసు కానిస్టేబుళ్లు గా అవకాశం ఇచ్చారు.
Tags:    
  • Telangana 
  • Telangana News 
  • Telangana Daily News 
  • Telugu News 
  • Telugu Politics 
  • Tupaki News 
  • Rtc Protest In Telangana 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Kcr 
  • Ktr 
  • Harish Rao 
  • Rtc Staff 

Similar News

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

బాబు విజనరీ కారు...జగన్ ప్రజా నేత కాలేరు !

2026-11-11 07:31 GMT

విజయసాయి తలుపులు తెరచారు...వైసీపీకి బిగ్ ఆఫర్

2026-11-11 07:30 GMT

ప్రణబ్ ప్రధాని ఆశలు...సోనియా నెరవేర్చలేక పోయారా ?

2026-11-11 07:29 GMT

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

Copyright @2026

Powered by Blink CMS