మాకు పదవులు.. దళితులు మీకెందుకురా.?

Update: 2019-02-20 04:48 GMT
పచ్చ కండువాల ప్రకోపం మరోసారి బయటపడింది. దళితులపై పచ్చపార్టీ నేతల దుర్భాషలు లైవ్ లో బయటపడ్డాయి. అధికార బలంతో దళితులను అని కూడా చూడకుండా టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

మొదటి నుంచి వివాదాస్పద నేతగా పేరున్న దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై మరోసారి రెచ్చిపోయారు. ఆయన దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దెందులూరు మండలంలోని శ్రీరామవరం గ్రామంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని దళితులను తీవ్రంగా అవమానించేలా నోరుజారాడు. ‘రాజకీయంగా మీరొకటి గుర్తు పెట్టుకోవాలి. మేము అగ్రకులాలకు చెందిన వాళ్లం. మాకు రాజకీయాలుంటాయి. పదవులు మాకే.. మీరు దళితులు. వెనుకబడిన వారు.. షెడ్యూల్ కాస్ట్ కు చెందిన వారు.. మీకెందుకురా రాజకీయాలు.. పిచ్చ... ముండాకొడుక్కుల్లారా’ అని తీవ్ర పదజాలంతో దూషించాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సమావేశం తాలూకు వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

చింతమనేని వ్యాఖ్యలపై దళిత సంఘాలు - నాయకులు మండిపడుతున్నారు. ఆయన ప్రజాప్రతినిధి కాదని,, ప్రజా గుండా అని ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని వైసీపీ నేత మోషేన్ రాజు తెలిపారు. దళితులను చింతమనేని అవమానపరచలేదని.. రాజ్యాంగాన్ని కించపరిచాడని ఎస్సీ అధ్యయన కమిటీ సభ్యుడు బత్తుల భీమారావు అగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానించిన చింతమనేనికి.. ఆయన్ను ప్రోత్సహిస్తున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని దళితులు హెచ్చరిస్తున్నారు.
Tags:    

Similar News