భారత్ పై చైనా మరో భారీ కుట్ర!
భారత్ పై చైనా కుట్రలో కొత్త కోణం తెరమీదకు వచ్చింది. ఆక్సాయ్ చిన్ ప్రాంతంలోని గల్వాన్ నది - దాని వెంబడి ఉన్న లోయ. ఈ ప్రాంతం దగ్గరే ఇండియా, చైనా సోల్జర్లమధ్య కొన్ని వారాలుగా జరుగుతున్న ఘర్షణ తారాస్థాయికి చేరి జరిగిన కాల్పుల్లో మన సైనికులు అమరులయ్యారు. ప్రస్తుతం చైనా కుట్రలపై అందరి దృష్టి పడింది. ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. చైనా మరో నాలుగు ప్రాంతాలను ఆక్రమించనున్నట్లు భారత్ ను టిబెట్ కు చెందిన బహిష్కృత నేత - ప్రజాస్వామ్యవాది లాబ్ సాంగ్ హెచ్చరించారు.
ప్రస్తుత పరిణామాల గురించి వివరిస్తూ - ఈస్ట్రన్ లడఖ్ పై చైనా కన్నేసిందని లాబ్ సాంగ్ తెలిపారు. అయితే, చైనా కుట్రల్లో అది ఒక భాగమేనని మరిన్ని ప్రాంతాలపై కుట్ర చేసిందన్నారు. `టిబెట్ ప్రాంతాన్ని చైనా నేతలు అరచేతిగా భావించారు. ఆ తర్వాత దాన్ని చైనా ఆక్రమించింది. ఇక చేతిలోని ఐదు వేల్ల వలే మరో ఐదు ప్రాంతాలను ఆక్రమించాలని చైనా చూస్తోంది. ఆ ఐదు ప్రాంతాల్లో లడఖ్ తొలి వేలు అయితే.. ఆ తర్వాత నేపాల్ - భూటాన్ - సిక్కిం - అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఉన్నాయి. చైనా దేశం వీటిని ఆక్రమించనుంది. భారత్ తక్షణం మేలు కోకపోతే చైనా కుట్రలు కొనసాగుతాయి.`` అని హెచ్చరించారు.
ఇక ప్రస్తుత వివాదం విషయానికి వస్తే, 1960 నాటి బార్డర్ మ్యాప్ విషయంతో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. ఆ మ్యాప్ విషయం చైనా-భారత్ వెనక్కి తగ్గడం లేదు. 60 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ ప్రాంతంలో గొడవ పెద్దదైంది. గత నెలలో చైనా సైనికులు నిబంధనలను ఉల్లంఘించి ఇండియా బార్డర్‌లోకి అడుగు పెట్టారు. దీంతో రెండు వైపులా టెన్షన్స్ పెరిగాయి. ఆ తర్వాత రెండు దేశాల మిలటరీ అధికారుల మధ్య చర్చ జరగడంతో టెన్షన్స్ కొంత వరకు తగ్గాయి. కానీ తాజాగా గొడవ పెద్దదై పలువురు మరణానికి కారణమైంది. చైనా తీరుపై సహజంగానే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది.