మనకు ఆ టైం జగన్ ఇవ్వట్లేదు : బాబు

Update: 2019-09-26 11:08 GMT
అమరావతిలోని తన నివాసంలో  ఈ ఉదయం పార్టీ సీనియర్లు - నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జగన్ ప్రభుత్వంపై ఆసక్తికర కామెంట్స్ చేశారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.  జగన్ పై మనం బురద చల్లాల్సిన పనిలేదని.. మనపై బురద జల్లాలని చూసి జగనే బురద జల్లుకుంటున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వమూ ఇంత అతి తక్కువ కాలంలో అప్రతిష్ట పాలు కాలేదని చంద్రబాబు అన్నట్టు సమాచారం.

ఇక చంద్రబాబు తాజాగా జగన్ సర్కారు చేస్తున్న పీపీఏల రద్దు.. హైకోర్టు తీర్పులు - కేంద్రమంత్రి లేఖలపై కూడా స్పందించారట.. జగన్ సర్కారు  దూకుడైన నిర్ణయాల వల్లే పీపీఏల రద్దును హైకోర్టు కొట్టివేసిందని.. కేంద్రమంత్రి లేఖలు రాశారని నేతలతో చర్చించినట్టు తెలిసింది.

ఇక గోదావరి వరద ప్రవాహంలో బోటు మునకపై కూడా చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. ప్రైవేటు సంస్థ ముందుకొచ్చి మరీ నదిలో మునిగిన బోటు తీస్తామన్న జగన్ సర్కారు అనుమతివ్వకుండా అభాసుపాలవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది..

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్ లను రద్దు చేయడం వల్ల ఇప్పుడు ఎక్కడ ఇసుక దొరకక జనాలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఏపీ వ్యాప్తంగా 20 లక్షల మంది ఇసుక కొరతతో నిర్మాణాలు ఆపేసి ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు నేతలతో అన్నట్టు తెలిసింది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ వివాదాలమయం చేశాడని తెలిపారట..   ఈ విషయాలన్నింటిపై గట్టిగా పోరాడాలని చంద్రబాబు టీడీపీ నేతలకు పిలుపునిచ్చినట్టు సమాచారం.

   

Tags:    

Similar News