కుటుంబంతో కలిసి థాయిలాండ్ వెళుతున్న చంద్రబాబు..

Update: 2021-12-29 04:30 GMT
టీడీపీ అధ్యక్షుడు.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజాగా విహారయాత్రకు వెళుతున్నాడు. ఆగ్నేయ ఆసియా దేశమైన థాయిలాండ్ కు టూర్ ప్లాన్ చేశాడు. జనవరి 2 వరకూ అక్కడే కుటుంబంతో గడిపి తిరిగి వస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు.

చంద్రబాబు థాయిలాండ్ వెళ్లిన తర్వాత కూడా 2 రోజుల వరకూ ఆయన కోటరీకి తప్ప ఎవరికీ తెలియనీయలేదు. వరుసగా 10 రోజులపాటు చంద్రబాబు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం సమాచారం ఇవ్వడంతో ఆయన విహారయాత్రకు వెళ్లిన విషయం బయటకు పొక్కింది.

హైదరాబాద్ నుంచి ఈనెల 24వ తేదీనే వెళ్లినప్పటికీ పలు కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

అయితే చంద్రబాబు థాయిలాండ్ టూర్ అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.


Tags:    

Similar News