అసెంబ్లీ సమావేశాలు... బాబు ఊహించనంత సూపర్ హిట్..!
అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగాయి. అదే విధంగా శాసనమండలి సమావేశాలు కూడా 15 రోజులు పాటు సాగాయి.;
అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు కొనసాగాయి. అదే విధంగా శాసనమండలి సమావేశాలు కూడా 15 రోజులు పాటు సాగాయి. మొత్తం సమావేశాల్లో వైసిపి ఆది నుంచి చెప్పినట్టుగానే అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయింది. కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే వైసిపి సభకు వచ్చింది. అనంతరం సభను పూర్తిస్థాయిలో బాయికాట్ చేశారు. మరోవైపు శాసనమండలిలో వైసిపి సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను అదే సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తినెయ్యి వినియోగంపై చర్చ వంటి అంశాల్లో వైసిపి బలమైన గళం వినిపించింది.
అసెంబ్లీ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈ 15 రోజుల్లో 75 గంటల పాటు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎక్కువగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి నియోజకవర్గాల్లో పరిస్థితులు అదే విధంగా వైసిపి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు వంటి కీలక అంశాలపై సభ్యులు చర్చించారు. అదేవిధంగా బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాలకు నిధుల పెంపు వంటి అంశాలపై కూడా ఈ సమావేశాల్లో కీలకంగా చర్చలు జరిగాయి.
ఓ రకంగా అసెంబ్లీలో కూటమి పార్టీలు అర్థవంతమైన చర్చలు చేశాయనే వాదన బలంగా వినిపించింది. విపక్షం లేకపోతే సభలో కేవలం ప్రశంసలు వంటి వాటికే అవకాశం ఉంటుందని భావించే వారికి అసెంబ్లీ ఈసారి చాలా భిన్నంగా కనిపించింది. ఒకవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నించడం దానికి మంత్రులు సమాధానం ఇవ్వడం బలమైన ప్రశ్నలే ఎమ్మెల్యేలు కూడా అడగడంతో సభ సజావుగానే అర్థవంతంగా సాగిందన్న వాదన వినిపించింది.
ఇక మండలి విషయానికి వస్తే అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు పైచేయి సాధించేందుకు ప్రయత్నించాయి. తిరుమల లడ్డు వివాదంపై వైసిపి నేతలు అదేవిధంగా కూటమి పార్టీల నేతలకు జరిగిన వివాదాలు మాటల మంటలు రూపాయి. ఇదే సమయంలోమండలి చైర్మన్ మోషన్ రాజు కుల ప్రస్తావన జగన్ మతప్రస్తావన వంటివి కూడా మండలిలో ఆగ్రహా వేశాలకు, సభ్యుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదన ఈసారి కూడా అసెంబ్లీలో మాత్రమే పాస్ అయింది. శాసనమండలిలో దానిని ప్రవేశపెట్టాల్సి ఉంది కానీ అది ప్రవేశ పెట్టలేదు. మరి దీన్ని బట్టి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి. మొత్తంగా చూస్తే అసెంబ్లీలో టిడిపిది, మండలిలో వైసీపీ ఇటు కూటమి పార్టీలు పరస్పరం పై చేయి సాధించేందుకు చేసిన ప్రయత్నాలు చేశాయి.