ఫైనల్ పిచ్ ట్యాంపర్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పిచ్చి ఆరోపణలు
భారత్ అంటే ఎప్పుడూ ఇంగ్లండ్ క్రికెటర్లకు చిన్న చూపే.. మన దేశ క్రికెట్ వ్యవస్థ ఎదగడాన్ని వారు ఎప్పటికీ జీర్ణించుకోలేరని మరోసారి స్పష్టమైంది.;
భారత్ అంటే ఎప్పుడూ ఇంగ్లండ్ క్రికెటర్లకు చిన్న చూపే.. మన దేశ క్రికెట్ వ్యవస్థ ఎదగడాన్ని వారు ఎప్పటికీ జీర్ణించుకోలేరని మరోసారి స్పష్టమైంది. క్రికెట్ కు పుట్టిల్లయినా.. జెంటిల్మన్ గేమ్ గా పేరున్న ఆటలో వారి తీరు మాత్రం అసహ్యకరమే. ఇది మరింత ఇప్పుడు తేలిపోయింది. అదికూడా భారత్ లో పుట్టి ఇంగ్లండ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన క్రికెటర్ కారణంగా కావడం గమనార్హం. టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా మరికొద్ది గంటల్లో న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దీనిపై ఇప్పటికే జట్ల విశ్లేషణలు మొదలయ్యాయి. ఎవరి బలం ఎంతో చెప్పేస్తూ విదేశీ కామెంటేటర్లు తమ నోటికి పనిచెబుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అసలే, టి20 ప్రపంచ కప్ ఫైనల్.. పైగా భారత్ ఆడుతోంది. అందుకే ఇంగ్లండ్ ఆటగాళ్ల సహజ అక్కసును చాటుకున్నాడు.
అసలు అది సాధ్యమా?
అహ్మదాబాద్ లో జరిగే ఫైనల్ కు సంబంధించిన పిచ్ ను టీమ్ఇండియాకు అనుకూలంగా ట్యాంపరింగ్ చేసే ప్రయత్నాలు జరిగాయని నాసిర్ హుస్సేన్ ఆరోపించాడు. ఈ మేరకు తనకు వార్తలు వచ్చాయంటూ నోరు జారాడు. తెల్లవారుజామున 1 నుంచి 2 గంటల మధ్య అహ్మదాబాద్ స్టేడియం బయట కొందరు ఉన్నారని.. పిచ్ ఏదో చేసేందుకే వారు ఉన్నారని హుస్సేన్ అన్నాడు. ఇది అక్షరాలా పిచ్ ట్యాంపరింగ్ అని నోరు పారేసుకున్నాడు. ఈ రోజుల్లో అసలు ఇలాంటిది సాధ్యమా? అని కూడా ఆలోచన లేకుండా మాట్లాడాడు.
టాస్ ను కూడా వదలరంట.. బంతుల్లో చిప్స్ అట
టీమ్ఇండియాకు పిచ్ ను అనుకూలంగా మార్చుకోవడమే కాదు.. టాస్ ను కూడా అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తాను విన్నానని హుస్సేన్ కుళ్లును చాటుకున్నాడు. అంతేకాదు.. బంతుల్లో చిప్స్ ఉన్నట్లు వదంతులు వస్తున్నట్లు కడుపు మంట చూపాడు. నిజంగా ఏదో జరుగుతోంది... క్రికెట్ ను తారుమారు చేసే ప్రయత్నం అది అంటూ దుర్బుద్ధి చాటాడు.
ఇంగ్లండ్ లోనే ఆడాలా?
సెమీఫైనల్లో టీమ్ఇండియా చేతిలో దారుణ పరాజయంతో ఇంగ్లండ్ టి20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. ఇది కూడా నాసిర్ హుస్సేన్ ఏడుపునకు కారణమైనట్లుంది. అందుకే, ప్రపంచ కప్ అసలు ఇండియాలో నిర్వహించవద్దంటూ దిక్కుమాలిన సలహా ఇచ్చాడు. శ్రీలంకలో అయితే కప్ బాగా జరుగుతుందని దిక్కుమాలిన సలహా ఇచ్చాడు.
అసలు భారత మూలాలున్నోడేనా?
ప్రపంచంలో ఎక్కడున్నా మన మూలం మర్చిపోకూడదు. కానీ, ఇంగ్లండ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన నాసిర్ హుస్సేన్ తమ కుటుంబానికి భారత్ తో సంబంధాలున్న సంగతి కూడా మర్చిపోయినట్లున్నాడు. అందుకే, భారత్ వంటి పెద్ద దేశంపై నోరు పారేసుకున్నాడు.